modi on pulwama attack: పుల్వామా అమరులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను ప్రధాని స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు దేశ ప్రగతి కోసం కృషి చేసేలా ప్రజలను ఆలోచింపజేస్తాయన్నారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పించారు.
పుల్వామా దాడిలో సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాాడారు. దేశానికి వారు చేసిన సేవలు మరులేనివన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని లెతపొరాలో సైనికాధికారులు, అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు మరువలేనివని.. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని అడిషనల్ డైరెక్టర్ జనరల్ డీఎస్ చౌదరి తెలిపారు.
2019లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్ర స్థావరంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది.
ఇదీ చదవండి: PSLV-C52 Launch Successful : పీఎస్‌ఎల్‌వీ- సీ52 ప్రయోగం విజయవంతం