ETV Bharat / bharat

'బీసీ ముఖ్యమంత్రిని చూడాలంటే జనసేన-బీజేపీ అభ్యర్థులను గెలిపించండి' - Warangal Latest News

Pawan Kalyan Election Campaign in Hanumakonda : బలిదానాల పైన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోవడం బాధ కలిగించిందని.. అందుకే దశాబ్ద కాలం తరవాత తెలంగాణలో పోటీకి దిగుతున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి శాసనసభ ఎన్నికల పోరుకు సంసిద్ధమైనట్లు తెలిపారు. ప్రచారంలో భాగంగా వరంగల్​లో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొని.. పార్టీ తరఫున నియోజకవర్గ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చూడాలంటే.. జనసేన-బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Pawan Campaign For BJP candidates success
Pawan Kalyan Election Campaign in Hanumakonda
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 4:42 PM IST

Updated : Nov 22, 2023, 6:07 PM IST

Pawan Kalyan Election Campaign in Hanumakonda : బలిదానాల పైన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించిందని.. అందుకే దశాబ్ద కాలం తరవాత తెలంగాణలో పోటీకి దిగుతున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pavan Kalyan) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి శాసనసభ ఎన్నికల పోరుకు సంసిద్ధమైనట్లు తెలిపారు. జనసేన అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం(Election Campaign) చేసేందుకు ఆయన ఇవాళ ఓరుగల్లు చేరుకున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్​లో భాగంగా.. హనుమకొండలో ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు.

రైతుల పంట బీమా సొమ్మును బీజేపీ ప్రభుత్వం భరిస్తుంది : అమిత్ షా

ఆంధ్రాలో రౌడీలు రాజ్యమేలుతున్నారని.. గుండాల పాలన నడుస్తోందని.. అలాంటి పరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడుతున్నానంటే.. దానికి వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని పవన్ అన్నారు. తన పోరాటానికి తెలంగాణ యువత(Telangana Youth) అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో.. అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ తిరుగుతానని తెలిపారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తామని.. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానని పవన్(Pawan Kalyan) పేర్కొన్నారు.

తెలంగాణలో నేను అధికారం చూడట్లే.. మార్పు చూస్తున్నాను. యువత, బీసీల తాలుకా సాధికారత చూస్తున్నాను. బీసీలు ముఖ్యమంత్రిగా కూర్చోవాలని ఆశిస్తున్నవారిలో నేనూ ఒకడిని. దానికోసం నా ప్రయత్నం తప్ప ఇక్కడేదో కూర్చోవాలని కాదు. తెలంగాణ బలిదానాలపై వచ్చిన రాష్ట్రం.. ఇప్పుడు ఇంత అవినీతి పాలవుతుందని నేనెప్పుడు ఊహించలేదు. కొందరు అవినీతిని లెక్కల్లో ధైర్యంగా బయట చెప్తుంటే చాలా బాధగా ఉంది. అదే పోరాట తెలంగాణ యువత బలంగా ఉంటే టీవీల్లో వాళ్లు మాట్లాడడాటికి కూడా భయపడాలి.-పవన్ కల్యాణ్, జనసేన అధినేత

'బలిదానాల పైన ఏర్పడ్డ తెలంగాణలో అవినీతి పెరగడం బాధగా ఉంది- అందుకే జనసేన పోటీ'

ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చింది : పరోక్షంగా అధికారం పార్టీపై విమర్శలు చేసిన జనసేనాని.. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామన్నారు. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని బీజేపీతో కలిసినట్లు వివరించారు. తనకు ఆంధ్రా(Andhra Pradesh) జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని పేర్కొన్నారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తానూ ఒకడినని ఉద్ఘాటించారు.

వరంగల్​ పశ్చిమ నియోజకవర్గంలో నేడు పవన్​ కల్యాణ్​ ఎన్నికల ప్రచారం - ఏం మాట్లాడతారా అని సర్వత్రా ఆసక్తి!

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని.. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమన్నారు. రాష్ట్రంలో కమీషన్ల రాజ్యం నడుస్తోందన్న పవన్.. తెలంగాణలో జనసేన పార్టీ(Janasena Party) ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తానని.. కమలం గుర్తుకు ఓటు వేసి.. రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్‌ను గెలిపించాలి అని ఓటర్లకు పవన్‌ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన - 8 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

బీజేపీ - జనసేన మధ్య తేలిన సీట్ల లెక్క, తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన

Last Updated : Nov 22, 2023, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.