ETV Bharat / bharat

సేమియా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ-ఎయిర్​పోర్ట్​లో పట్టివేత

చెన్నై ఎయిర్​పోర్టులో అక్రమంగా తరలిస్తున్న సౌదీ అరేబియా కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సేమియా ప్యాకెట్లలో దుబాయ్​కు ఈ కరెన్సీకి తరలిస్తున్న క్రమంలో నిందితుడు అధికారులకు పట్టుబడ్డాడు.

smuggling
విదేశీ కరెన్సీ
author img

By

Published : Dec 9, 2021, 8:16 PM IST

దుబాయ్​కు వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై విమాశ్రయంలో బుధవారం జరిగింది. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. రూ.19.79 లక్షలు విలువ చేసే సౌదీ​ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

సేమ్యా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ

సేమియా ప్యాకెట్లలో దుబాయ్​కు ఈ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు నిందితుడు ప్రయత్నించాడని అధికారులు వెల్లడించారు. విదేశీ డబ్బుకు సంబంధించి నిందితుడు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : Flights Ban: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.