ETV Bharat / bharat

మహారాష్ట్ర, గుజరాత్​ల్లోనూ కరోనా లెక్కల మాయ! - Part II: Serious mismatch in mortality data between official figures, ground reality

వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలపై వెలువడుతున్న అధికారిక గణాంకాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల గణాంకాలపై ఈటీవీ భారత్ ఫ్యాక్ట్ చెక్ చేపట్టగా.. తాజాగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభుత్వ వివరాలను పరిశీలించింది. సర్కారు లెక్కలకు, వాస్తవ గణాంకాలకు సారూప్యత లేదని గుర్తించింది.

mortality data
మహారాష్ట్ర, గుజరాత్​ల్లోనూ కరోనా లెక్కల మాయ!
author img

By

Published : Apr 18, 2021, 1:36 PM IST

మూడు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతూ వస్తోంది. రోజుకు వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందనేందుకు ఈ గణాంకాలే ఓ ఉదహరణ. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ఒక్కరోజే.. 2,61,500 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఎన్నడూ లేనంతగా 1501 మంది కరోనాకు బలయ్యారు. అయితే, ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ వివరాలకు.. శ్మశానంలో అంత్యక్రియలు జరుగుతున్న మృతదేహాలకు పొంతనలేకుండా పోయింది. దీనిపై ఈటీవీ భారత్ చేపట్టిన రియాలిటీ చెక్​లో గణాంకాల మధ్య తీవ్రమైన అవకతవకలు బయటపడ్డాయి.

మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, దిల్లీలో క్షేత్రస్థాయి పరిస్థితిని.. 'కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా?' శీర్షికతో ఈటీవీ భారత్ ఇప్పటికే మీ ముందుంచింది. దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర సహా గుజరాత్​లో గణాంకాల మధ్య పొంతన లేకపోవడాన్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చింది. పలు శ్మశానవాటికల నుంచి సేకరించిన గణాంకాలు, ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాల మధ్య సారూప్యత లేకపోవడాన్ని ఇది స్పష్టం చేస్తోంది.

మహారాష్ట్ర

దేశంలో కరోనా వ్యాప్తి రెండు దశల్లో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పుడు సగటున 60 వేల కేసులు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. శనివారం 67,123 మందికి కరోనా సోకిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధరించింది. 419 మంది మరణించారు.

ఈటీవీ భారత్ పరిశీలనలో భాగంగా.. ఏప్రిల్ 9న విడుదల చేసిన గణాంకాల్లో లోపాలను గుర్తించింది. అహ్మద్ నగర్​లోని అమర్​ధామ్ శ్మశానవాటికలో ఆ రోజు 49 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. ప్రభుత్వ గణాంకాలు మాత్రం.. జిల్లాలో ముగ్గురే చనిపోయారని చెబుతున్నాయి. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 301 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

mortality data
అహ్మద్​నగర్​లో పొంతనలేని గణాంకాలు

ఇవి అహ్మద్​నగర్​లోని ఒక్క శ్మశానవాటికకు సంబంధించిన వివరాలే. ఈ జిల్లాలో ఎన్నో శ్మశానవాటికలు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్మశానవాటికల్లో ఎన్ని మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి? అందులో ఎంత మంది కరోనా బాధితులు ఉండొచ్చనే విషయంపై ఆందోళన నెలకొంది.

గుజరాత్

గుజరాత్​లోనూ కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల నుంచి క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 9,541మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 97 మంది బలయ్యారు.

ఏప్రిల్ 15న భావ్​నగర్​లోని కుంభార్వద శ్మశానవాటికలో 20 శవాలకు అంత్యక్రియలు చేశారు. మరోవైపు, అధికారిక లెక్కలు మాత్రం భావ్​నగర్​లో ఒక్కరు కూడా కరోనాతో మరణించలేదని చెబుతున్నాయి. భావ్​నగర్​లో కుంభార్వదతో పాటు ఎన్నో శ్మశానవాటికలు ఉన్నాయి. అక్కడ అంత్యక్రియలు చేసిన శవాల్లోనూ కొవిడ్ రోగులు ఉండే అవకాశం లేకపోలేదు.

mortality data
భావ్​నగర్​ డేటా...

ప్రతి రోజు ఇక్కడికి 15-20 మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకొస్తారని కుంభార్వదా శ్మశాన ట్రస్టీ అర్వింద్ పర్మార్ చెబుతున్నారు. అందులో కరోనా రోగుల శవాలూ ఉంటాయని తెలిపారు.

-అర్వింద్ పర్మార్, శ్మశాన ట్రస్టీ

"ప్రతి రోజు 15-20 వరకు కరోనా మృతదేహాలు ఇక్కడి వస్తాయి. వార్తల్లో మాత్రం భావ్​నగర్​లో ఒకరు లేదా ఇద్దరు చనిపోయినట్లు చెబుతున్నారు. అక్కడ ఒకరు ఇద్దరే చనిపోతే.. ఇక్కడికి 20 మంది ఎలా వస్తున్నారు? భావ్​నగర్​లోని మరో మూడు శ్మశానాల్లోనూ కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతాయి. మొత్తం భావ్​నగర్​లో రోజుకు 50-60 మరణిస్తారు. కోమోర్బోడిస్(రెండుకు మించి వ్యాధులు ఉండటం) అని చెబుతున్నారు. ఏదైనా సరే ప్రాణాలను కాపాడాలి. ప్రభుత్వానికి సమర్థమైన చర్యలు తీసుకునే సత్తా ఉంది కానీ ఏం చేయడం లేదు."

-అర్వింద్ పర్మార్, కుంభార్వదా శ్మశాన ట్రస్టీ

అయితే, శ్మశానంలో అంత్యక్రియలు జరిగిన మృతదేహాలన్నీ కరోనా రోగులవే అని స్థూలంగా చెప్పడం భావ్యం కాదు. అందులో సాధారణ మరణాలు, ప్రమాదాల్లో మరణించివారూ ఉండొచ్చు.

కానీ పరీక్షల్లో వైరస్ బయటపడక ముందే మరణించినవారూ ఇందులో ఉండొచ్చనే అనుమానం.. ఆందోళనకు దారితీస్తోంది. శ్మశానాల్లో జరుగుతున్న అంత్యక్రియల సంఖ్య పెరుగుతుండటం.. ప్రభుత్వ అధికారిక లెక్కలకు పొంతన లేకపోవడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ప్రభుత్వాలకు ఈటీవీ భారత్ ప్రశ్నలు..

Part II: Serious mismatch in mortality data between official figures, ground reality
ఈటీవీ భారత్ ప్రశ్నిస్తోంది..!

ఇదీ చదవండి: టీకాతో ఇన్​ఫెక్షన్ ఆగదు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.