ETV Bharat / bharat

'కమెడియన్​ కునాల్​ ట్వీట్లపై వివరణ ఇవ్వండి' - పార్లమెంటరీ సంయుక్త కమిటీ

సామాజిక మాధ్యమం ట్విట్టర్​పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కునాల్​ కమ్రా చేసిన అభ్యంతరకర ట్వీట్లను ఎందుకు అనుమతించారని ప్రశ్నించింది. ఈ అంశంలో వివరణ సమర్పించాలని ట్విట్టర్​ను ఆదేశించింది .

Parliamentary panel grills Twitter over 'obscene' tweets by Kunal Kamra targeting SC, CJI
'కమెడియన్​ కునాల్​ ట్వీట్లపై వివరణ ఇవ్వండి'
author img

By

Published : Nov 19, 2020, 5:10 PM IST

కమెడియన్​ కునాల్​ కమ్రా చేసిన అభ్యంతరకర ట్వీట్లపై ఎలాంటి చర్యలు తీసుకోని ట్విట్టర్​పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో వివరణ సమర్పించాలని ట్విట్టర్​ను జేపీసీ ఛైర్​పర్సన్​​ మీనాక్షి లేఖి ఆదేశించారు. సుప్రీం కోర్టును, సీజేఐను ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశాడు కునాల్​.

అంతకుముందు.. లద్దాఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై క్షమాపణలు తెలియజేసింది ట్విట్టర్​. తమ తప్పును ఈ నెల చివరి నాటికి సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వివరించింది. సమాచార పరిరక్షణ బిల్లుపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి నేతృత్వంలో ఏర్పాటైన జేపీసీ ముందు.. హాజరైన ట్విట్టర్‌ ప్రతినిధులు.. ఈ మేరకు తమ వివరణ ఇచ్చుకున్నారు. ఆ సందర్భంలో కునాల్​ కమ్రా ట్వీట్లపై ట్విట్టర్​ను ప్రశ్నించింది జేపీసీ.

"సుప్రీం కోర్టు, సీజీఐకు వ్యతిరేకంగా కునాల్​ కమ్రా చేసిన ట్వీట్లకు ట్విట్టర్​ అనుమతినివ్వడం అవమానకరం. రాజ్యాంగ వ్యవస్థలోని ఉన్నతాధికారాలు గల సుప్రీం కోర్టుపై, సీజేఐపై తప్పుడు వ్యాఖ్యలకు ట్విట్టర్​ అనుమతి ఇస్తోంది. దీనిపై కమిటీలోని సభ్యులందరు ట్విట్టర్​పై అసంతృప్తితో ఉన్నారు. గతంలో నిషేధించిన ఖాతాలు, పోస్టులపై వివరణ ఇవ్వాలని ట్విట్టర్​ను మేం ఆదేశించాం."

-- మీనాక్షి లేఖి, సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఛైర్​పర్సన్​.

అయితే.. ఈ విషయంలో తన ట్వీట్లను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు కునాల్​. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. దీనిని విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు కునాల్​. ఈ అంశంలో అతడిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ సిద్ధమయ్యారు.

ఇదీ చూడండి:'సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.