లోక్‌సభ గురువారానికి వాయిదా
మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన లోక్‌సభ కార్యకలాపాలు రాత్రి 7.30 వరకు సజావుగా సాగియి. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. పలు అంశాలపై చర్చించిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.