ETV Bharat / bharat

విపక్షాల నిరసన- లోక్​సభ రేపటికి వాయిదా - parliament live

parliament live
పార్లమెంట్​ లైవ్
author img

By

Published : Dec 21, 2021, 10:56 AM IST

Updated : Dec 21, 2021, 2:46 PM IST

14:45 December 21

లోక్​సభ రేపటికి వాయిదా..

విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్​సభ రేపటికి వాయిదా పడింది.

13:35 December 21

విపక్షాల నిరసన..

లఖింపుర్​ ఖేరీ ఘటనపై లోక్​సభ, రాజ్యసభలోని విపక్ష నేతలు నిరసన చేపట్టారు. పార్లమెంట్​లోని గాంధీ విగ్రహం నుంచి విజయ్​ చౌక్​ వరకు మార్చ్​ నిర్వహించారు. కేంద్రమంత్రి అజయ్​ మిశ్రాను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

11:48 December 21

విపక్షాల నిరసనలతో లోక్​సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.

11:21 December 21

రాజ్యసభ వాయిదా

విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల గైర్హాజరు అంశాన్ని ప్రస్తావించి విపక్షాలు నినాదాలు చేశాయి. సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ భేటీకి విపక్షాలు గైర్హాజరయ్యాయి. తమకు సరైన సమయంలో సమాచారం అందించలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. తాము లేకుండానే సమావేశాలు నిర్వహించడాన్ని వ్యతిరేకించాయి.

10:45 December 21

పార్లమెంట్ లైవ్ అప్​డేట్స్

శీతాకాల సమావేశాల నేపథ్యంలో భాజపా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నిర్వహించింది. పార్టీకి చెందిన ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

మరోవైపు, విపక్షాలు సైతం ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర రాజీనామా సహా పలు అంశాలపై డిమాండ్ చేస్తున్న విపక్ష ఎంపీలు.. సభలో ఇవాళ అనుసరించాల్సిన ప్రణాళికలపై సమాలోచనలు జరిపారు.

Last Updated : Dec 21, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.