ETV Bharat / bharat

పార్లమెంట్​లో కరోనా కలకలం.. వెంకయ్య కీలక ఆదేశాలు

Parliament staff Covid: పార్లమెంట్​లో కరోనా కలకలం సృష్టించింది. 400మందికిపైగా సిబ్బంది, అధికారులు కొవిడ్​ బారినపడ్డారు. వారితో సన్నిహతంగా మెలిగిన మిగితా సిబ్బందిని ఐసోలేషన్​కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితని సమీక్షించిన రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.. వైరస్​ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Parliament staff test Covid positiv
పార్లమెంట్​లో కరోనా కలకలం
author img

By

Published : Jan 9, 2022, 2:24 PM IST

Parliament staff Covid: కొద్ది రోజుల్లో​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది, అధికారులు కొవిడ్​-19 బారినపడ్డారు.

"జనవరి 4 నుంచి 8వ తేదీ వరకు మొత్తం 1,409 మందికి చేపట్టిన కరోనా పరీక్షల్లో 402 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణకు వారి నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​కు పంపించాం."

- అధికారులు

కరోనా సోకిన వారిలో 200 మంది లోక్​సభ, 69 మంది రాజ్యసభ సిబ్బంది సహా మరో 133 మంది సహాయ సిబ్బంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారంతా కరోనా జాగ్రత్తలు, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని సూచించినట్లు తెలిపారు. పార్లమెంట్​ వెలుపల కొవిడ్​ సోకిన సిబ్బందిని ఈ జాబితాలో చేర్చలేదని పేర్కొన్నారు. కరోనా సోకిన తోటి సిబ్బందిని కలిసిన వారిని ఐసోలేషన్​కు తరలించామని, పలువురు లోక్​సభ, రాజ్యసభ అధికారులు సైతం వైరస్​ బారినపడినట్లు చెప్పారు.

వెంకయ్య కీలక ఆదేశాలు..

పార్లమెంట్​లో కరోనా కలకలం సృష్టించిన నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. ఈనెల చివరి వారంలో బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్​ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, గర్భిణీలు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతులిచ్చారు. రాజ్యసభ సచివాలయం సమయాల్లో మార్పులు చేశారు. అధికారిక సమావేశాలను వర్చువల్​గా నిర్వహించాలని నిర్ణయించారు. సిబ్బంది హాజరును సగానికి తగ్గించినట్లు రాజ్యసభ సెక్రెటేరియట్​ తెలిపింది. కొత్త ఆదేశాల ప్రకారం సెక్రెటరీ లేదా ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ ర్యాంకు కింది స్థాయి అధికారులు, సిబ్బంది 50 శాతం మంది జనవరి 31 వరకు వర్క్​ ఫ్రమ్​ హోం ద్వారా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: పార్లమెంట్​లో కరోనా కలకలం- 350 మందికి పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.