- మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రసంగించిన టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్
- ఇప్పటికే మహిళా రిజర్వేషన్లను బంగాల్‌లో అమలు చేస్తున్నాం: కాకోలీ ఘోష్
- దేశంలో ఏకైక మహిళా సీఎం బంగాల్‌లోనే ఉన్నారు: టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్
- 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా సీఎంగా భాజపా ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు: కాకోలి
- మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌కు ఎందుకు ముడి పెడుతున్నారు?: టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్
Parliament Special Session Live : 'రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు'.. 'డీలిమిటేషన్‌తో ముడి ఎందుకు?'
Published : Sep 20, 2023, 10:47 AM IST
|Updated : Sep 20, 2023, 12:29 PM IST
12:29 September 20
12:13 September 20
'రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు'
రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ తీసుకొస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. బిల్లు కోసం గతంలో ఎన్నోసార్లు ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. ఈ బిల్లు బీజేపీ ఎన్నికల హామీ అని గుర్తు చేసిన ఆమె.. ఇందుకోసం డిమాండ్లు చేయాల్సి వచ్చిందని అన్నారు. మహిళలకు వందనాలు కాదని..సమానత్వం కావాలని పేర్కొన్నారు.
11:58 September 20
మహిళా రిజర్వేషన్లపై తాను మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు హేళన చేశారని డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. మహిళలకు గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు. కనిమొళి పక్కనే కూర్చున్న ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సైతం బీజేపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
11:21 September 20
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం: సోనియాగాంధీ
- కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థిస్తోంది: సోనియాగాంధీ
- ఈ బిల్లును తీసుకురావడంతో రాజీవ్‌గాంధీ స్వప్నం నెరవేరింది: సోనియాగాంధీ
- రాజీవ్‌గాంధీ స్థానికసంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు: సోనియాగాంధీ
- ఈ బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలి: సోనియాగాంధీ
11:10 September 20
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చర్చను ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పార్లమెంటుతో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని మేఘవాల్ వివరించారు. ఈ చట్టంతో మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. పదిహేనేళ్లపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లో ఉంటుందని చెప్పారు.
10:52 September 20
రోజంతా చర్చ: మేఘవాల్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారమంతా చర్చ జరుగుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిల్లుపైనే చర్చ ఉంటుందని చెప్పారు. రాజకీయాలతో ఈ బిల్లుకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
10:39 September 20
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు లోక్‌సభ రెడీ.. కాంగ్రెస్ తరఫున మాట్లాడనున్న సోనియా
Parliament Special Session Live : చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు లోక్‌సభ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చను సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. తమ పార్టీ నుంచి సోనియా తొలుత మాట్లాడతారని కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదురి వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించనున్నారు. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో కూటమి నేతలు సమావేశం కానున్నారు.
ఏంటీ బిల్లు?
నారీశక్తి వందన్ అధినియమ్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మంగళవారం ఈ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. బుధవారం 11 గంటల నుంచి దీనిపై చర్చ జరగనుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చి అమలులోకి వస్తే మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి.