ETV Bharat / bharat

నా కొడుకు అమాయకుడు, న్యాయ పోరాటానికి మేము సిద్ధం! : పార్లమెంట్ దాడి 'మాస్టర్​మైండ్' తండ్రి - పార్లమెంట్​పై దాడి కేసు మాస్టర్​మైండ్ లలిత్ ఝా

Parliament Security Breach Master Mind Lalit Jha : పార్లమెంట్​లో దాడికి పాల్పడ్డ ఘటనలో మాస్టర్​మైండ్​గా భావిస్తున్న తన కుమారుడు లలిత్ ఝా అమాయకుడు అని అతడి తండ్రి దేవానంద్ ఝా అన్నాడు. అతడికి న్యాయం జరిగేందుకు కోర్డును ఆశ్రయిస్తామన్నాడు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు పటియాలా కోర్టుకు నివేదించారు.

Parliament Security Breach Master Mind Lalit Jha

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 10:44 AM IST

Parliament Security Breach Master Mind Lalit Jha : పార్లమెంట్​ దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా అమాయకుడని, ఏమి తెలియదని అతడి తండ్రి దేవానంద్​ ఝా అంటున్నాడు. అతడు ట్యూషన్లు చెపుతూ జవనం సాగిస్తున్నాడని తెలిపాడు. తమను బిహార్​లోని దర్భంగా పంపించి, వ్యక్తిగత పని మీద దిల్లీ వెళ్తున్నట్లు చెప్పి డిసెంబర్ 10న రైలులో బయలుదేరాడని చెప్పాడు. చివరగా తాము లలిత్​తో మాట్లాడింది అదేనని అతడు తెలిపాడు. ఎందుకోసం దిల్లీ వెళ్లాడో తమకు తెలియదని చెప్పాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం ఇతరుల ద్వారా తమకు తెలిసిందని వెల్లడించాడు. తన కుమారుడికి న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయిస్తామని వివరించాడు.

  • #WATCH | Parliament security breach accused Lalit Jha's father Devanand Jha says, "He was a very good boy...He used to teach at a coaching centre...We came to know (about the incident) yesterday after he was arrested..." pic.twitter.com/edTgLdk2sJ

    — ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటనలో లలిత్ ఎలా చిక్కుకున్నాడో తమకు తెలియదని లలిత్ సోదరుడు శంభు ఝా తెలిపాడు. 'అతడు (లలిత్) ఎప్పుడూ ఇబ్బందులకు దూరంగా ఉంటాడు. అతడు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఎవరితో మాట్లడకుండా ప్రశాంతంగా ఉండేవాడు. ట్యూషన్లు చెప్పడమే కాకుండా లలిత్​ పలు NGOలతో కూడా పనిచేసేవాడు. టీవీ ఛానెళ్లలో అతడి ఫొటోలు చూసి మేము ఆశ్చర్యానికి గురయ్యాము' శంభు ఝా విలేకరులతో చెప్పాడు.

Parliament Security Breach Master Mind Lalit Jha
లలిత్ ఝా తల్లిదండ్రులు

పార్లమెంట్ ఘటన జరిగిన తర్వాత లలిత్ మోహన్ ఝా స్వయంగా వచ్చి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అయితే లొంగిపోవడానికి ముందే లలిత్‌ కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పార్లమెంట్‌ ఘటన తర్వాత రాజస్థాన్‌లోని కూచమన్‌కు పారిపోయిన లలిత్‌ అక్కడ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి నలుగురు నిందితుల ఫోన్లను తగులబెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

'దేశంలో ఆరాచకం సృష్టించేందుకు కుట్ర'
Parliament Security Breach Probe : పార్లమెంట్‌లో చొరబాటు ద్వారా దేశంలో అరాచకం సృష్టించేందుకు (Parliament Security Breach Reason) నిందితులు కుట్ర పన్నారని తాజాగా దిల్లీ పోలీసులు తెలిపారు. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాపై ఒత్తిడి తేవాలనుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను తమ కస్టడీకి ఇవ్వాలని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు కోరారు. ఈ మేరకు పటియాలా హౌజ్‌ కోర్టులో పలు వివరాలు వెల్లడించారు.

పార్లమెంటులోకి చొరబడే కుట్ర పన్నేందుకు నిందితులు చాలా సార్లు సమావేశమయ్యారని తెలిపారు. కేసు దర్యాప్తులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దిల్లీ నుంచి పారిపోయిన అనంతరం లలిత్‌కు వారు సహకరించారని తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు లలిత్, దిల్లీ-జైపూర్‌ సరిహద్దు సమీపంలో తన ఫోన్‌ను పారేశాడు. మిగతా నిందితుల ఫోన్లను కూడా తన వెంట తీసుకెళ్లి తగులబెట్టేశాడు. పార్లమెంటు కుట్రకు నిందితుల రెండు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా మొదటి దానినే అమలుచేసినట్లు తెలుస్తోంది. పోలీసులు 15 రోజుల కస్టడీ కోరినప్పటికీ కోర్టు లలిత్ ఝాను ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.

మనోరంజన్ గది సీజ్​
పార్లమెంట్​ దాడి కేసుకు సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం స్థానిక అధికారులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కేసులో రెండో నిందితుడైన మనోరంజన్​ గదిని సీజ్​ చేశారు. అయితే తన కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఖాళీగా ఉంటున్నాడని మనోరంజన్ తండ్రి తెలిపాడు. దీంతో దిల్లీతో పాటు తదితర ప్రాంతాలు తిరగడానికి అతడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అతడి బ్యాంక్ ఖాతాలు, ఫోన్​ పే, గూగుల్ పే నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ఈ కేసులో మొదటి నిందితుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సాగర్ శర్మ, మైసూర్​ వచ్చి మనోరంజన్​ను కలిశాడు. అయితే వీరిద్దరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అని ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

పార్లమెంట్​ ఘటనపై 'సీన్‌ రీక్రియేషన్‌'! లొంగిపోవడానికి ముందే కీలక ఆధారాలు ధ్వంసం

షూ సోల్ కట్ చేసి గ్యాస్ బాంబులు ఫిక్స్- పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో విస్తుపోయే నిజాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.