ETV Bharat / bharat

పెగసస్​పై పట్టువీడని విపక్షాలు- ఉభయ సభలు రేపటికి వాయిదా

parliament
పార్లమెంట్​
author img

By

Published : Aug 3, 2021, 11:18 AM IST

Updated : Aug 3, 2021, 4:17 PM IST

16:13 August 03

పెగసస్​ వ్యవహారంపై విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. వాయిదా అనంతరం ప్రారంభమైన లోకసభలో ఆందోళనలు కొనసాగించాయి. ఈ విషయంపై చర్చ జరపాలని డిమాండ్​ చేశాయి. దీంతో సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.

14:42 August 03

రాజ్యసభలో విపక్షాల ఆందోళనల మధ్యే దివాలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. 

14:20 August 03

లోక్​సభ వాయిదా

లోక్​సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే అత్యవసర రక్షణ సేవల బిల్లుకు సభలో ఆమోదం లభించింది. అనంతరం సభ సాయంత్రం 4గంటలకు వాయిదా పడింది.

12:42 August 03

విపక్షాలు ఆందోళనల నేపథ్యంలో లోక్​సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.

11:43 August 03

లోక్​సభ వాయిదా

వాయిదా తీర్మానాలపై చర్చించాలని లోక్​సభలోనూ విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్​ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.

11:14 August 03

విపక్షాలు ఆందోళన- ఉభయ సభలు వాయిదా

పలు సమస్యలపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఛైర్మన్​ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు.

అంతకు ముందు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష నాయకులు విస్తృతంగా చర్చించారు. అల్పాహార సమావేశం పేరుతో దిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ నేతృత్వంలో విపక్ష నేతలు సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరిపారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికార భారతీయ జనతా పార్టీ  పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళన, సభ జరుగుతున్న తీరుపై చర్చించింది. పెండింగ్ బిల్లుల ఆమోదంపైనా.. నేతలు చర్చించారు. వైద్య, దంత కళశాలల్లో ఓబీసీ కోటాకు ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని భాజపా పార్లమెంటరీ పార్టీ స్వాగతించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. 

Last Updated : Aug 3, 2021, 4:17 PM IST

For All Latest Updates

TAGGED:

rajya sabha
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.