పెగసస్ వ్యవహారంపై విపక్షాల ఆందోళనలు విరమించకపోవడం వల్ల లోక్సభ ముందుకు సాగే పరిస్థితి కనడపడలేదు. దీంతో సభ గురువారానికి వాయిదా పడింది. రేపు ఉదయం 11గంటలకు తిరిగి సభ ప్రారంభం కానుంది.
పెగసస్పై విపక్షాల రగడ- ఉభయ సభలు గురువారానికి వాయిదా - parliament monsoon session 2021
16:14 July 28
15:23 July 28
విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్సభ సాయంత్రం 4గంటలకు వాయిదా పడింది.
14:58 July 28
రాజ్యసభ గురువారానికి వాయిదా
పెగసస్ వ్యవహారంపై విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. అంతకుముందు.. విపక్ష నేతల నిరసనల మధ్యే జువనైల్ జస్టిస్ యాక్ట్ సవరణ బిల్లుకు ఎగువసభ ఆమోదం తెలిపింది.
14:41 July 28
పెగసస్ వ్యవహారంపై విపక్షాల ఆందోళనలు కొనసాగగా.. లోక్సభ 3 గంటల వరకు వాయిదా పడింది.
అంతకుముందు... దివాలా స్మృతి చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. అదే సమయంలో విపక్ష సభ్యులు పెద్ద బ్యానర్ తీసుకుని సభలోకి వచ్చారు. పెగసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఎంతగా వారించినా... వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య లోక్సభ వాయిదా పడింది.
14:20 July 28
రాజ్యసభ మధ్యాహ్నం 2.45 వరకు వాయిదా పడింది.
12:40 July 28
పెగసస్, ఇతర అంశాలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడం వల్ల ఉభయ సభలు మరోమారు వాయిదా పడ్డాయి. రాజ్యసభ, లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కానున్నాయి.
ఖేలా హోబె(ఆట ఆరంభం)
అంతకు ముందు లోక్సభలో విపక్ష సభ్యులు ఆట ఆరంభం (ఖేలా హోబె) అనే నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. బంగాల్ ఎన్నికల్లోనూ దీదీ ఇదే నినాదాన్ని ఉపయోగించారు.
12:14 July 28
లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సభలో కార్యకలాపాలు సజావుగా సాగకుండా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. పెగసస్ సహా పలు అంశాలపై చర్చ జరపాలని పట్టుబట్టారు. గంటకు పైగా సభ నినాదాల మధ్యే నడిచినప్పటికీ.. పరిస్థితి మితిమీరడం వల్ల వాయిదా వేస్తూ స్పీకర్ ఓంబిర్లా నిర్ణయం తీసుకున్నారు. 12.30కు మళ్లీ సమావేశం కానున్నట్లు చెప్పారు.
11:22 July 28
తగ్గేది లేదు: రాహుల్
ఉభయ సభల ప్రారంభానికి ముందు.. విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి.. ఎన్సీపీ, శివసేన సహా పలు పార్టీల పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ సైతం ఈ సమావేశంలో పాల్గొని ఎంపీలతో మాట్లాడారు.
దేశంలోని ప్రధాన సమస్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని సమావేశం అనంతరం రాహుల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, పెగసస్, రైతుల సమస్యలను సభలో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో వీటిపై చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
11:07 July 28
రాజ్యసభ వాయిదా
రాజ్యసభ విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. పెగసస్ సహా వివిధ అంశాలపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేయడం వల్ల.. సభకు అంతరాయం కలిగింది. దీంతో వాయిదా వేస్తూ ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందు.. ధోలావీరా ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకోవడంపై రాజ్యసభ హర్షం వ్యక్తం చేసింది. హరప్పా నాగరికత విలసిల్లిన ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు లభించిందని పేర్కొంది.