ETV Bharat / bharat

విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా - లోక్​ సభ సమావేశాలు

పార్లమెంట్​
parliament
author img

By

Published : Aug 9, 2021, 11:14 AM IST

Updated : Aug 9, 2021, 4:47 PM IST

16:44 August 09

రాజ్యసభ మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది.

15:15 August 09

ట్రైబ్యునళ్ల సంస్కరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్​సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు పెద్దల సభలోనూ గట్టెక్కింది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 3:30 గంటల వరకు వాయిదా పడింది.

14:22 August 09

పెగసస్​పై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్​సభ మంగళవారానికి వాయిదా పడింది.

12:56 August 09

లోక్​సభ వాయిదా

పెగసస్​పై ఆందోళన నేపథ్యంలో లోక్​సభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.

12:54 August 09

లోక్​సభలో మూడు కీలక బిల్లులకు ఆమోదం

లోక్​సభలో మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. షెడ్యూల్డ్​ తెగల సవరణ బిల్లు,  డిపాజిట్ ఇన్సూరెన్స్,  క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ సవరణ బిల్లు, పరిమిత భాగస్వామ్య సవరణ బిల్లును లోక్​సభ ఆమోదించింది.

12:25 August 09

లోక్​సభ వాయిదా

పెగసస్​పై ఆందోళన నేపథ్యంలో లోక్​సభ మధ్యాహ్నం 12.30గంటలకు వాయిదా పడింది.

12:07 August 09

రాజ్యసభ వాయిదా

పెగసస్​పై విచారణకు విపక్షాలు పట్టుబట్టడం వల్ల రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. సభ ముందుకు సాగలేని పరిస్థితుల్లో మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్​.

11:48 August 09

రాజ్యసభ వాయిదా

పెగసస్​పై ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది.

11:41 August 09

లోక్​సభ వాయిదా

పెగసస్​పై ఆందోళన కొనసాగడం వల్ల లోక్​సభ మళ్లీ వాయిదా పడింది. విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్​.

11:08 August 09

పార్లమెంట్​ లైవ్​

లోక్​సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగసస్​తోపాటు ఇతర వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో చేసేదేమీ లేక లోక్​సభను స్పీకర్​ సభను 11.30గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభను ఛైర్మన్​ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. 

అంతకు ముందు క్విట్​ ఇండియా వార్షికోత్సవం నేపథ్యంలో అమరవీరులకు సభ్యులు నివాళులర్పించారు. అలాగే టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్​ చోప్రాతో పాటు పతకాలు సాధించిన ఇతర క్రీడాకారులను లోక్​సభ ప్రత్యేకంగా అభినందించింది.  

సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటులో విపక్ష పార్టీల నేతలు సమావేశం అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ చర్చించారు.  

ఇదిలా ఉంటే లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ఈ బిల్లును కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌ ప్రవేశపెట్టనున్నారు.

Last Updated : Aug 9, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.