ETV Bharat / bharat

రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అస్త్రాలతో పాలక, విపక్షాలు సిద్ధం - రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament budget session: పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాల రెండో విడత సోమవారం ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల ప్రకారం సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Parliament budget session
Parliament budget session
author img

By

Published : Mar 13, 2022, 4:57 PM IST

Parliament budget session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సభలు ఒకేసారి భేటీ కానున్నాయి. కరోనా నిబంధనలకు లోబడి సమావేశాలు నిర్వహించనున్నారు.

budget session second phase

ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలపై.. చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు నిర్ణయించాయి.

ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం దిల్లీలో భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె.సురేశ్, జైరామ్ రమేశ్‌ హజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు కె. సురేశ్ తెలిపారు.

దీటుగా తిప్పికొట్టేలా...

బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం లభించేలా సర్కారు కసరత్తు చేస్తోంది. లోక్​సభలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్​ను సోమవారం పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించిన భాజపా.. సరికొత్త ఉత్తేజంతో సమావేశాలకు రానుంది. విపక్షాల ఎత్తుగడలను దీటుగా తిప్పికొట్టేలా సిద్ధమవుతోంది.

బడ్జెట్ సమావేశాల తొలి అర్ధభాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి.

ఇదీ చదవండి: బడ్జెట్​ సెషన్​.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్​ స్కెచ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.