ETV Bharat / bharat

ఆస్తులు పంచాక వృద్ధులను పట్టించుకోని పిల్లలు.. అధికారులకు ఫిర్యాదు.. వెంటనే తిరిగి.. - కర్ణాటక యాదగిరి లేటెస్ట్ న్యూస్

పిల్లలు తమను పట్టించుకోవట్లేదని అసిస్టెంట్ కమీషనర్​కు ఫిర్యాదు చేశారు ఓ వృద్ధుడు, వృద్ధురాలు. దర్యాప్తు చేసిన రెవెన్యూ అధికారులు వృద్ధుల ఆస్తిని తిరిగి వారికి బదిలీ చేశారు.

parents tooks back assets from children
పిల్లలు నుంచి ఆస్తులు తిరిగి తీసుకున్న తల్లిదండ్రులు
author img

By

Published : Dec 23, 2022, 9:32 PM IST

తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే పిల్లలు మాత్రం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగులు చూసుకునేందుకు ప్రస్తుత కాలంలో ఇష్టపడట్లేదు. అనాధాశ్రమంలో వదిలేయడం, వాళ్లను పట్టించుకోకుండా వేరే ఇంట్లో వదిలేస్తుంటారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..
తమను పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదని బిడ్డల పేరిట రాసిచ్చిన భూమిని తమ పేరిట బదిలీ చేయించాలని యాదగిరి అసిస్టెంట్ కమిషనర్​ షాలం హుస్సేన్​కు ఫిర్యాదు చేశారు ఓ వృద్ధుడు, వృద్ధురాలు. ఈ రెండు కేసులను పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్.. సీనియర్ సిటిజన్స్ జస్టిస్ బోర్డు యాక్ట్​ 2007 ప్రకారం ఆస్తిని వృద్ధుల పేరిట బదిలీ చేశారు.

యాదగిరి జిల్లాలోని శిరవాలా గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ హిరేమఠ్​కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి అతడు 10 ఎకరాల భూమిని పంచాడు. కొన్నాళ్లకు రవీంద్రనాథ్ భార్య మరణించింది. ఆ తర్వాత బిడ్డలెవరూ అతడిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో తాను పిల్లలకు ఇచ్చిన 10 ఎకరాల భూమిని తిరిగి ఇప్పించాలని కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కమిషనర్​.. 10 ఎకరాల భూమిని రవీంద్రనాథ్ పేరిట బదిలీ చేయాలని ఆదేశించారు.

మరోవైపు, గుర్మల్​కల్​లోని ధర్మాపుర గ్రామానికి చెందిన శంకరమ్మకు నలుగురు సంతానం. ఆమెకున్న 4 ఎకరాల భూమిని పిల్లలకు పంచేసింది. తాను అనారోగ్యం పాలైన బిడ్డలు పట్టించుకోవట్లేదని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు ఆమె పేరిట 4 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.