ETV Bharat / bharat

కొడుకును చంపి.. సైకిల్​పై తీసుకెళ్లి కాల్చేసిన తల్లిదండ్రులు! - కొడుకును చంపిన తల్లి

Parents killed their son: కన్నబిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతారు తల్లిదండ్రులు. వారికి ఎలాంటి కష్టం రాకుండా కాచుకుంటారు. అలాంటిది.. తమ కొడుకును హతమార్చి, గుట్టుచప్పుడు కాకుండా ఊరిబయటకు తీసుకెళ్లి కాల్చేశారు వృద్ధ దంపతులు. తమిళనాడు మదురైలో ఈ సంఘటన జరిగింది. వారు అంత కఠిన నిర్ణయం తీసుకోవటానికి గల కారణమేంటి?

parents killed their son
కొడుకును చంపిన తల్లిదండ్రులు
author img

By

Published : Jan 29, 2022, 4:46 PM IST

Updated : Jan 29, 2022, 6:21 PM IST

కొడుకును చంపి సైకిల్​పై తీసుకెళ్లి కాల్చేసిన తల్లిదండ్రులు

Parents killed their son: కొడుకును తల్లిదండ్రులే హత్య చేసి.. మూటగట్టి సైకిల్​పై ఊరిబయటకు తీసుకెళ్లి కాల్చేసిన సంఘటన తమిళనాడు మదురై జిల్లాలో జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

ఏం జరిగింది?

మదురై జిల్లాలోని కారిమేడు పోలీసులకు వైగాయ్​ రివర్​ సమీపంలో కాలిన మృతదేహం ఉన్నట్లు శుక్రవారం సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం నిమిత్తం మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో మృతుడు మదురైలోని అరప్పాలయమ్​కు చెందిన మనికందన్​(42)గా గుర్తించారు. అతనికి భార్య, తల్లిదండ్రులు(మురుగేశన్​, క్రిష్ణవేణి) ఉన్నారు. మణికందన్​ మద్యానికి బానిసయ్యాడని, రోజూ తాగొచ్చి కుటుంబసభ్యులతో గొడవకు దిగేవాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు పోలీసులు.

మణికందన్​ ప్రవర్తనతో విసిగెత్తిపోయారు తల్లిదండ్రులు మురుగేశన్​, క్రిష్ణవేణి. గురువారం రాత్రి అతడ్ని హత్య చేశారు. మృతదేహాన్ని మూటగట్టి గుట్టుచప్పుడు కాకుండా సైకిల్​పై తీసుకెళ్లి నది సమీపంలో కాల్చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు ఈ దృశ్యాలు చిక్కాయి.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మురుగేశన్​, క్రిష్ణవేణిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో లోతైన దర్యాప్తు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:మొక్కేకదా అని పీకేస్తే.. కొట్టి చంపిన మైనర్​

Last Updated : Jan 29, 2022, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.