ETV Bharat / bharat

'ఏప్రిల్​లో పాఠశాలలు తెరవాలి'

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా ఏడాదిని ఏప్రిల్​లోనే  ప్రారంభి తల్లిదండ్రులు భావిస్తున్నట్టు 'లోకల్​ సర్కిల్స్' నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. సుమారు 69శాతం మంది ఇందుకు మొగ్గు చూపగా.. కేవలం 19 శాతం మందే జనవరిలో పాఠశాలలు పునఃప్రారంభం కావాలని కోరుతున్నట్టు తేలింది.

Parents expects the academic year to begin in: Local Circle Survey
'ఏప్రిల్​లో పాఠశాలలు తెరవాలి'
author img

By

Published : Jan 5, 2021, 6:56 AM IST

కొవిడ్​-19 తీవ్రత, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్​లోనే పాఠశాలలు తెరవాలని 69 శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. 19 శాతం మంది మాత్రమే జనవరిలో ప్రారంభించాలంటున్నారని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 19వేల మంది తల్లిదండ్రులపై 'లోకల్​ సర్కిల్స్​' అనే ఆన్​లైన్​ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.

టీకా విషయంలోనూ..

టీకా విషయంలోనూ తల్లిదండ్రులు తొందరపడటం లేదని సర్వే ద్వారా తెలుస్తోంది. కేవలం 26 శాతం మంది మాత్రమే ఏప్రిల్​ కల్లా తమ పిల్లలకు టీకా వేయించుకోవాలి అనుకుంటున్నారట. 56 శాతం మంది మాత్రం వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. టీకా డేటా, సమర్థతకు సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులోకి వచ్చాకే వ్యాక్సిన్​ విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు సర్వేలో తేలింది.

ఇదీ చదవండి: 8వ అత్యధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా 2020

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.