మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. బాంబే హైకోర్టులో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ గురువారం వ్యాజ్యం దాఖలు చేశారు.
అంతకుమందు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరమ్ వీర్ సింగ్ బుధవారం ఉపసంహరించుకున్నారు. హైకోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరమ్ వీర్ సింగ్ వ్యాజ్యం ఇదీ..
హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రతినెలా 100 కోట్లు వసూళ్లను పోలీస్ అధికారి సచిన్ వాజేకు లక్ష్యంగా పెట్టారని సీఎంకు లేఖ రాశారు పరమ్ వీర్ సింగ్. ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో తన బదిలీని కూడా సవాలు చేశారు. దేశ్‌ముఖ్ ఇంటి సీసీ ఫుటేజీని తక్షణం స్వాధీనం చేసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు.
సీఎంకు దేశ్‌ముఖ్ లేఖ..
మరోవైపు.. ముంబయి మాజీ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ రాసిన లేఖలోని వాస్తవాలపై దర్యాప్తు చేయాలని సీఎం ఉద్ధవ్‌కు లేఖ రాశారు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.
ఏప్రిల్ 3 వరకు ఎన్ఐఏ కస్టడీలో వాజే..
అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు కేసులో అరెస్టై, సస్పెన్షన్‌కు గురైన పోలీస్ అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. తనకు ఈ కేసుకూ ఏ సంబంధమూ లేదని న్యాయస్థానం ఎదుట సచిన్ వాజే నివేదించారు. తనను ఈ కేసులో అన్యాయంగా బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సచిన్‌వాజే ఎన్ఐఏ కస్టడీని కోర్టు ఏప్రిల్ 3 వరకు పొడిగించింది.
సీసీటీవీ వీడియో కలకలం..
మహారాష్ట్రంలో సంచలనం సృష్టించిన మన్సుఖ్ హిరేన్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఓ సీసీటీవీ ఫుటేజీలో మన్సుఖ్ హిరేన్, పోలీస్ అధికారి సచిన్ వాజే కలిసి సంచరిస్తున్న వీడియో బహిర్గతమైంది. ముంబయిలోని ఓ ట్రాఫిక్ జంక్షన్లో సచిన్ వాజేకు చెందిన మెర్సిడెస్ కారు వైపు హిరేన్ వెళ్లడం, అనంతరం.. హిరేన్‌ను తన కారులో వాజే ఎక్కించుకోవడం అందులో కనిపించింది.
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో.. సంబంధిత వాహనం తనదేనని, అంతకు కొద్ది రోజుల క్రితమే అది చోరీకి గురైందని మన్సుఖ్ హిరేన్.. పోలీసులను ఆశ్రయించారు. అనంతరం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసును కేంద్ర హోం శాఖ ఈ నెల 20న ఎన్ఐఏకు అప్పగించింది.
ఇవీ చూడండి: