ETV Bharat / bharat

పన్నీర్​సెల్వంకు ఘోర పరాభవం.. సీసాలతో దాడి.. సభ నుంచి వాకౌట్​ - పళనిస్వామి

తమిళనాడులోని చెన్నైలో అన్నాడీఎంకే సమన్వయకర్త​ పన్నీర్​ సెల్వంకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అధికార పగ్గాలపై గురువారం జరిగిన కీలక సమావేశంలో తన మద్దతుదారులతో పన్నీర్​సెల్వం సభ నుంచి వాకౌట్​ చేశారు. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ కొందరు నేతలు వాటర్​ బాటిల్స్​ విసిరారు. ఆయన కారు గాలి కూడా తీసేశారు.

PANNEERSELVAM
PANNEERSELVAM
author img

By

Published : Jun 23, 2022, 1:38 PM IST

Updated : Jun 23, 2022, 4:46 PM IST

పన్నీర్​సెల్వంకు ఘోర పరాభవం

తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకేలో ఏక నాయ‌క‌త్వం కావాల‌న్న డిమాండ్ వ‌స్తున్న‌ నేప‌థ్యంలో గురువారం చెన్నైలోని శ్రీవారు వెంకట చలపతి ప్యాలెస్​లో కీలక సమవేశం జరిగింది. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియ‌ర్ నేత‌లు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. అయితే గురువారం జరిగిన సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

  • #WATCH | Chennai, Tamil Nadu | Former Deputy Chief Minister O Panneerselvam walked out halfway through the AIADMK General Council meeting. Members of the General Assembly continued to raise slogans asking him to leave. pic.twitter.com/vTvOaCmSSd

    — ANI (@ANI) June 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఒకరి నాయకత్వంలో పార్టీ నడవాలనే నిర్ణయించినందున.. పళనిస్వామి(ఈపీఎస్)​ క్యాంప్​కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు. దీంతో​ సమావేశం మధ్యలోనే పార్టీ సమన్వయకర్త​ పన్నీర్​ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్​ చేశారు. పార్టీ డిప్యూటీ సెక్రటరీ ఆర్​. వైతిలింగంతో సహా ఓపీఎస్​ మద్దతుదారులంతా మీటింగ్​ హాల్​ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు తీవ్రస్థాయిలో ఓపీఎస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపు మంచి నీళ్ల సీసాలను విసిరారు. పన్నీర్​సెల్వం కారు టైర్ల గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సమావేశం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసింది. జూలై 11న మళ్లీ అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం జ‌ర‌గ‌నుంది.

ఆ సమావేశం నుంచే.. 2016లో అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణానంతరం.. ఆ పార్టీ ద్వంద్వ నాయకత్వ సూత్రాన్ని అనుసరిస్తోంది. అయితే పళనిస్వామి మాత్రం పార్టీలో ఏక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 14న జిల్లా కార్యదర్శి సమావేశం జరిగినప్పటి నుంచి పార్టీలో ఏక నాయకత్వం కోసం చర్చ మొదలైంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. గురువారం ఈ కీలక సమావేశాన్ని జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏక నాయకత్వానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదింపజేయాలని అనుకున్నారు. కానీ, తన సంతకం లేకుండా జనరల్​ బాడీ తీర్మానం ఆమోదం పొందదంటూ పన్నీర్​ సెల్వం సమావేశానికి ముందే వ్యాఖ్యలు చేశారు. అదే కాకుండా అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. అయితే ఆ పిటిషన్​ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ అంతర్గత విషయమని బెంచ్ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: 'మహా' సంక్షోభం.. శిందేకు పెరుగుతున్న బలం.. అసోంలోనే మకాం!

'ప్లాసీ'కి ముందే ఆర్కాట్​లో బీజం.. భారతావనిలో ఆంగ్లేయుల రాజ్యం!

Last Updated : Jun 23, 2022, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.