ETV Bharat / bharat

కట్టెల కోసం వెళ్లిన మహిళకు జాక్​పాట్​.. ఆ వజ్రంతో రాత్రికి రాత్రే లక్షాధికారి - Panna Tribal Woman Found Diamond

కట్టెల కోసం అడవికి వెళ్లిన ఓ మహిళను అదృష్టం వరించింది. రూ.20 లక్షలు విలువైన వజ్రం ఆమెకు దొరికింది.

diamond mines panna
రూ.20 లక్షల విలువైన వజ్రం
author img

By

Published : Jul 28, 2022, 3:03 PM IST

మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో ఓ గిరిజన మహిళను అదృష్టం వరించింది. అడవిలో కట్టెల కోసం వెళ్లగా ఆమెకు రూ.20 లక్షల విలువైన వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకొచ్చి భర్తకు చూపించింది. ఇద్దరూ కలిసి డైమండ్​ కార్యాలయానికి వెళ్లి ఈ వజ్రాన్ని అధికారులకు చూపించారు.

diamond mines panna
రూ.20 లక్షల విలువైన వజ్రం

అసలేం జరిగిందంటే: పురుషోత్తంపుర్‌కు చెందిన గోందా బాయీ అనే గిరిజన మహిళ కట్టెల కోసం బుధవారం పన్నా అడవులకు వెళ్లింది. అప్పుడు ఆమెకు వజ్రం దొరికింది. భర్తతో కలిసి డైమండ్ కార్యాలయానికి వెళ్లగా.. ఆ వజ్రం 4.39 క్యారెట్లని అని అధికారులు తెలిపారు. ఆ వజ్రం ఖరీదు సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వ పన్నులు, రాయల్టీ మినహాయించిన తర్వాత మిగతా డబ్బుల్ని మహిళకు అందజేస్తామని తెలిపారు.

'అడవి నుంచి కట్టెలు సేకరించి అమ్ముతూ, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు ఆరుగురు సంతానం. అందులో నలుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలకు వివాహ వయసు వచ్చింది. వజ్రం వేలం ద్వారా వచ్చిన డబ్బును ఇంటి నిర్మాణానికి, కుమార్తెల వివాహానికి వినియోగిస్తాను.

-గోందా బాయీ, గిరిజమ మహిళ

బుందేల్​ఖండ్​ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాల వెలికితీతకు ప్రభుత్వమే భూముల్ని లీజుకు ఇస్తూ ఉంటుంది. అలా దొరికిన వజ్రాల్ని పన్నాలోని డైమండ్​ ఆఫీస్​లో జమ చేస్తే.. అధికారులు వాటి నాణ్యతను నిర్ధరించి, వేలం వేస్తారు.

ఇవీ చదవండి: దిల్లీ వైద్యుడి గొప్ప మనస్సు.. ఫ్రీ సర్జరీతో పాక్ అమ్మాయికి కొత్త జీవితం

39 మంది పిల్లలకు ఒకే సిరంజీతో కరోనా టీకా.. ఇదేంటని అడిగేసరికి పరార్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.