ETV Bharat / bharat

సర్పంచ్​కు దొరికిన భారీ డైమండ్​.. రాత్రికి రాత్రే లక్షాధికారిగా..!

విలువైన వజ్రం దొరకడం వల్ల ఓ సర్పంచ్ సహా ఆయన ఐదుగురు స్నేహితులు లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్​లో పన్నాలో జరిగిందీ ఘటన.

diamond found in panna
పన్నా గనుల్లో దొరికిన డైమండ్
author img

By

Published : Dec 12, 2022, 7:35 PM IST

భారత్​లోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో అరుదైన వజ్రం బయటపడింది. ప్రకాశ్​ మజుందార్​ అనే సర్పంచ్​ తన ఐదుగురు స్నేహితులతో కలిసి.. జరువాపుర్​లోని ఓ గనిని లీజుకు తీసుకున్నారు. అక్కడ వారికి 14.21 క్యారెట్ల వజ్రం దొరికింది. అయితే ఈ సంవత్సరం దొరికిన అతిపెద్ద వజ్రం ఇదేనని మంజుదార్ తెలిపారు. ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసినట్లు ఆయన చెప్పారు.

వజ్రాల వేలం ద్వారా వచ్చిన డబ్బును ఐదుగురు స్నేహితులతో కలిసి సమానంగా పంచుకుంటానని మంజుదార్ చెప్పారు. పిల్లల చదువు కోసం ఈ డబ్బును వినియోగిస్తానని మజుందార్​ తెలిపారు. ఈ ఏడాది పన్నా గనుల్లో దొరికిన అతిపెద్ద వజ్రమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు తనకు 12 వజ్రాలు దొరికాయని వెల్లడించారు.

మధ్యప్రదేశ్​లోని పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే.. ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒకవేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వళ డైమండ్​ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు​ తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.