ETV Bharat / bharat

మరణించిన వ్యక్తిని సర్పంచ్​గా గెలిపించిన గ్రామస్థులు.. మళ్లీ ఆయనకే ఓటేస్తామంటూ..

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు ఓ వ్యక్తి. అంతలోనే విధి ఆయన పట్ల చిన్నచూపు చూసింది. మెదడులోని నరాలు చిట్లి.. ఎన్నికలకు వారం రోజుల ముందే అభ్యర్థి మరణించారు. ఆయనపై ఉన్న సానుభూతిలో గ్రామస్థులు మరణించిన వ్యక్తికే ఓటేసి గెలిపించారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

panchayat election in haryana
పంచాయతీ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి గెలుపు
author img

By

Published : Nov 14, 2022, 10:36 PM IST

హరియాణా కురుక్షేత్రలోని జన్​దేడీ గ్రామంలో అరుదైన ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో నామిమేషన్​ వేసి మరణించిన అభ్యర్థి ఎన్నికల్లో గెలుపొందారు. రాష్ట్రంలో రెండో విడతలో భాగంగా కురుక్షేత్ర జిల్లాలో నవంబరు 12న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల అధికారులు షాకయ్యారు. మరణించిన అభ్యర్థే విజేతగా నిలిచారు.

జన్​దేడీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన రాజ్‌బీర్ సింగ్.. మెదడులో నరాలు చిట్లి పోలింగ్​కు వారం క్రితమే మరణించారు. అంతకుముందే నామినేషన్​ వేయడం వల్ల.. ఆయన నామినేషన్​ ఉపసంహరణ సాధ్యపడలేదు. అయితే నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో మృతుడు రాజ్​బీర్​ సింగ్​కు గ్రామస్థులు ఓటు వేసి గెలిపించారు. జన్​దేడీ పంచాయతీ సర్పంచ్ పదవికి ముగ్గురు పోటీ చేశారు. అందులో మృతుడు రాజ్​బీర్ ఒకరు కాగా.. మరో ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే అనూహ్యంగా.. వారిద్దరూ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

జన్​వాడీ గ్రామపంచాయతీలో మొత్తం 1,790 ఓట్లు ఉండగా.. అందులో 1660 ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ ఓట్లు మృతుడు రాజ్​బీర్​ సింగ్​ పొంది విజయం సాధించారు. మృతుడికి 17 ఏళ్ల కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మళ్లీ జరిగే ఎన్నికల్లో రాజ్​వీర్ సింగ్​ భార్యను గెలిపిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. రాజ్​వీర్ సంతానానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన వయసులేదని అన్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో జన్​వాడీ పంచాయతీకి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చదవండి: 'రాష్ట్రపతి ఓ స్వీట్ లేడీ'.. బంగాల్ మంత్రి వ్యాఖ్యలకు దీదీ క్షమాపణ

పెళ్లిచూపుల జాతర.. 250 మంది అమ్మాయిల కోసం 11వేల మంది యువకుల పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.