Border Bor returns to Pak: భారత్- పాకిస్థాన్ సరిహద్దులో జన్మించిన శిశువు ఇంటికి చేరుకున్నాడు. 'బార్డర్' పేరుతో పిలుస్తున్న బాలుడు డిసెంబర్ 2న జన్మించగా.. తాజాగా జనన ధ్రువీకరణ పత్రం మంజూరైంది. దీంతో శిశువు తల్లిదండ్రులు అట్టారీ- వాఘా సరిహద్దు గుండా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.
Baby born at Attari wagah:
పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన హిందూ దంపతులైన బలమ్‌రామ్, నింబోదేవి.. పుణ్యక్షేత్రాల సందర్శనకై భారత్‌కు వచ్చారు. రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు విధించగా.. వీరు సరిహద్దులో చిక్కుకుపోయారు. పాకిస్థాన్‌కు తిరిగివెళ్లేందుకు అనుమతి లభించలేదు.
ఆంక్షలు సడలించిన తర్వాత వెళ్లేందుకు ప్రయత్నించినా.. అప్పటికే వారి వీసా గడువు ముగిసిపోవడం వల్ల కుదరలేదు. దీంతో అట్టారీ- వాఘా సరిహద్దులోనే రిసార్టులో తలదాచుకున్నారు. ఓ ఎన్జీఓ వీరికి సహాయం చేసింది. వీసాలు, అవసరమైన పత్రాలు సమకూర్చేందుకూ సహకరించింది.
Baby born India Pak border:
గర్భంతో ఉన్న నింబోదేవి డిసెంబర్ 2న మగబిడ్డకు జన్మనిచ్చింది. కూలీ పనులకు వెళ్లిన ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా.. సమీప గ్రామాల ప్రజలు వచ్చి పురుడు పోశారు. వైద్య సహాయం అందించారు. సరిహద్దులో పుట్టినందున తమ బిడ్డకు బార్డర్ అని పేరు పెట్టుకున్నారు ఈ దంపతులు.
డిసెంబర్ 9న దంపతులిద్దరికీ వీసాలు వచ్చాయి. శిశువు జన్మధ్రువీకరణ పత్రం సైతం లభించింది. దీంతో వీరు పాకిస్థాన్ తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. వీరితో పాటు మరికొందరు పాకిస్థానీలు సైతం తమ దేశానికి తిరిగి వెళ్లారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించి వీరిని పాకిస్థాన్‌కు పంపించారు అధికారులు.
ఇదీ చదవండి: