ETV Bharat / bharat

ఉగ్రవాదుల నిధుల కోసం పాక్ కుట్ర- భారత్​కు డ్రగ్స్ సరఫరా

ఉగ్రవాదులకు నిధులు అందించేందుకే పాకిస్థాన్​ జమ్ముకశ్మీర్​లో (news kashmir drugs) డ్రగ్స్​ సరఫరా చేస్తోందన్నారు డీజీపీ దిల్​బాగ్​ సింగ్. కుట్రలు ఫలించేందుకు పాక్​ స్థానిక యువతను బలిచేస్తోందన్నారు.

news kashmir drugs
పాకిస్థాన్
author img

By

Published : Nov 27, 2021, 8:15 AM IST

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో (news kashmir drugs) డ్రగ్స్​ను తరలిస్తోందన్నారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్​. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలను రవాణా చేసి స్థానిక యువతను అందుకు బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకశ్మీర్​ పోలీస్​ (news kashmir drugs) సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దిల్​బాగ్​.. ఈ వ్యాఖ్యలు చేశారు.

జాజర్​ కొట్లీలో గురువారం పట్టుబడ్డ 52 కేజీల హెరాయిన్​ సహా ఇటీవల పూంచ్​, బారాముల్లా, కుప్వారా వంటి సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్​ కలకలం సృష్టించాయి. ఈ ఘటనలను ఉద్దేశిస్తూ దిల్​బాగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. కుట్రలు ఫలించేందుకు పాక్​ స్థానిక యువతను బలిచేస్తోందని దిల్​బాగ్​ పేర్కొన్నారు. డ్రగ్స్​ రవాణాను కట్టడి చేసేందుకు పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు.

ఇదీ చూడండి : సుక్మా అడవుల్లో ఎదురుకాల్పులు​.. నక్సల్​ కమాండర్​ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.