అఫ్గానిస్థాన్‌పై భారత్ నిర్వహించే సదస్సుకు తాను హాజరు కానని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు మొయీద్ యూసుఫ్(Pakistan NSA India) స్పష్టం చేశారు. సదస్సు కోసం దిల్లీని సందర్శించేది లేదని వెల్లడించారు. భారత్‌ను శాంతిదూత పాత్రలో చూడబోమని పేర్కొన్నారు.
అంతకుముందు.. అణ్వాయుధాల విషయంలో ఇరు దేశాల మధ్య ప్రస్తుత సంబంధాలను దృష్టిలో ఉంచుకుని పాక్ నిర్ణయం తీసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ అన్నారు.
వచ్చే వారం అఫ్గానిస్థాన్‌పై నిర్వహించే ప్రాంతీయ సదస్సుకు రావాల్సిందిగా పాకిస్థాన్‌ను భారత్ ఆహ్వానించింది. ఈ సదస్సు.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వంలో జరగనున్నట్లు సమాచారం.
2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి(Pathankot attack) అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు(India Pak relations) దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఉరిలోని భారత సైనిక శిబిరంపై దాడి సహా ఎప్పటికప్పుడు దాడులు చేయడం వల్ల ఆ సంబంధాలను మరింత దిగజారాయి.
అవకాశం వచ్చిన ప్రతిసారి భారత్‌పై తన అక్కసును వెల్లగక్కుతుంది పాక్. అయితే పాక్‌తో సంబంధాలు(India Pak relations latest update) మెరుగుపరుచుకునేందుకు భారత్ ప్రయత్నించినా.. ఆ దేశ నేతలు వక్రబుద్ధినే ప్రదర్శిస్తున్నారు.
ఇదీ చూడండి: