ETV Bharat / bharat

60 మంది భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​

Pakistan has hijacked fishermen: భారత్​కు చెందిన సుమారు 60 మంది జాలర్లను పాకిస్థాన్​ కిడ్నాప్​ చేసింది. వీరంతా గుజరాత్​లోని పోరుబందర్​కు చెందిన వారు. వీరితో పాటు 10 పడవల్ని కూడా పాక్​ అధికారులు సీజ్​ చేశారు. గడిచిన 24 గంటల్లో సుమారు 13 బోట్లను పాక్ తీరప్రాంత రక్షణ దళం హైజాక్ చేసింది.

Pakistan has hijacked 60 fishermen
జాలర్లను బంధించిన పాక్​
author img

By

Published : Feb 9, 2022, 10:18 AM IST

Pakistan has hijacked fishermen: అరేబియా సముద్ర తీరంలో పాకిస్థాన్ ఆగడాలు మితి మీరుతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్థాన్ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్థాన్ తీర ప్రాంత రక్షకదళం అపహరించినట్లు తెలుస్తోంది.

ఓఖా, పోరుబందర్ లకు చెందిన మత్స్యకారులను పాకిస్థాన్ బందీలుగా చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 17 బోట్లను, వంద మందికి పైగా మత్స్యకారులను పాకిస్థాన్ తీరప్రాంత రక్షణ దళం బందీలుగా చేసుకోవటంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. భారత ప్రాదేశిక జలాల్లోనే చేపల వేటకు వెళ్తున్నప్పటికీ పాకిస్థాన్ అక్రమంగా అపహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

ఇదీ చూడండి: కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా అన్నపానీయాలు లేక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.