ETV Bharat / bharat

భారత​ అంతర్గత వ్యవహారాల్లో పాక్ మళ్లీ జోక్యం! - భారత్​ అంతర్గత వ్యవహారాల్లో పాక్​ మరోసారి జోక్యం!

భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ మరోసారి జోక్యం చేసుకునేందుకు యత్నించింది. టూల్​కిట్​ వ్యవహారంలో దిశరవిని అరెస్టు చేయడాన్ని ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలోని భారత ప్రభుత్వం.. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల అణచివేయాలని చూస్తోదంని వ్యాఖ్యానించింది.

Pakistan again meddles in India's affairs amid Disha Ravi row
భారత్​ అంతర్గత వ్యవహారాల్లో పాక్​ మరోసారి జోక్యం!
author img

By

Published : Feb 16, 2021, 10:02 AM IST

పర్యావరణ కార్యకర్త దిశ రవికి మద్దతు తెలుపుతూ.. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు పాకిస్థాన్​ మరోసారి యత్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్​ పాలనలోని భారత ప్రభుత్వం.. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాలను అణచివేయాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పాక్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ నేతృత్వంలోని పాకిస్థాన్​ తెహ్రీక్​-ఏ-ఇన్​సాఫ్(పీటీఐ) పార్టీ​.. ట్విట్టర్​ వేదికగా పేర్కొంది.

Pakistan again meddles in India's affairs amid Disha Ravi row
భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ.. పీటీఐ చేసిన ట్వీట్​

"మోదీ, ఆరెస్సెస్​ పాలనలోని భారత ప్రభుత్వం.. తమకు వ్యతిరేకంగా ఉన్న గళాన్ని అణచివేయాలని చూస్తున్నారు. టూల్​కిట్​ కేసులో దిశ రవిని వాళ్లు ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని అదే విధంగా చేస్తున్నారు.

--పాకిస్థాన్​ తెహ్రీక్​-ఏ-ఇన్​సాఫ్

పీటీఐ ట్వీట్​తో పాటు.. పాకిస్థాన్​​ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్​ ఖాతా కూడా.. దిశ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వీడియో క్లిప్​ను పోస్టు చేశాయి.

పర్యావరణ కార్యకర్తకు ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం మద్దతు తెలపడంపై.. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తమ దేశంలోని మైనార్టీలకు రక్షణ కల్పించడంలో పాక్​ అనసరిస్తున్న విధానాన్ని అందరూ తప్పుబడుతున్నారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలుగా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా నిలిచారు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బర్గ్. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు​ ట్విట్టర్​లో ఓ టూల్​ కిట్​ను పోస్టు చేశారు. గ్రెటా షేర్​ చేసిన టూల్​ కిట్​ రూపకల్పన, వ్యాప్తిలో దిశ కీలక కుట్రదారని పోలీసులు అంటున్నారు. అందుకోసం వాట్సాప్​లో ఆమె ఓ గ్రూప్​ నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగస్వాములైన మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.