ETV Bharat / bharat

పాక్ కుట్ర భగ్నం- సరిహద్దుల్లో 47 కేజీల హెరాయిన్​ స్వాధీనం - heroin heroin

Pak smugglers: సరిహద్దుల గుండా భారత్​లోకి భారీగా డ్రగ్స్​ సరఫరా చేసే పాక్​ ప్రయత్నాన్ని భగ్నం చేశాయి బలగాలు. 47 కేజీల హెరాయిన్​ సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

Pak smugglers Punjab
Pak smugglers
author img

By

Published : Jan 28, 2022, 10:23 AM IST

Updated : Jan 28, 2022, 11:10 AM IST

Pak smugglers: భారత్​లోకి అక్రమంగా డ్రగ్స్​ సరఫరా చేస్తున్న పాక్​ ముఠాను అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. స్మగ్లర్లపై కాల్పులు జరిపి తరిమికొట్టారు. 47 కేజీల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్​ గురుదాస్​పుర్​లోని చందూ వదాలా పోస్ట్​ వద్ద జరిగిన ఈ ఘటనలో ఓ బీఎస్​ఎఫ్​ జవాను గాయపడ్డారు.

శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో సరిహద్దుల వద్ద పాక్​ స్మగ్లర్ల కదలికలను గమనించిన ఓ జవాన్​.. వారిపై కాల్పులు జరిపారు. వారు ప్రతిఘటించగా.. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ క్రమంలోనే భారత జవానుకు గాయాలయ్యాయని బీఎస్​ఎఫ్​ డీఐజీ తెలిపారు.

Pak smugglers Punjab
పంజాబ్​ గురుదాస్​పుర్​ సెక్టార్​ వద్ద 47 కేజీల హెరాయిన్​ సీజ్​

Heroin Seized: స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్​తో పాటు.. 7 ప్యాకెట్ల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న ఓ చైనీస్​ పిస్టల్​, ఏకే 47 పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Pak smugglers Punjab
స్మగ్లర్ల వద్ద పట్టుబడ్డ హెరాయిన్​, ఆయుధాలతో బీఎస్​ఎఫ్​ సిబ్బంది

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: మద్యం ప్రియులకు గుడ్​ న్యూస్​.. కిరాణ షాపుల్లోనూ వైన్​!

'మా నాన్నను గెలిపించండి'.. ఎన్నికల ప్రచారంలో ఏడేళ్ల బాలిక

Last Updated : Jan 28, 2022, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.