ETV Bharat / bharat

ముగ్గురు పాక్​ స్మగ్లర్లు హతం.. 36 కిలోల హెరాయిన్​ స్వాధీనం

author img

By

Published : Feb 6, 2022, 9:13 AM IST

Updated : Feb 6, 2022, 9:21 AM IST

Narcotic smugglers: జమ్ముకశ్మీర్​లోని సాంబా సరిహద్దులో అక్రమంగా భారత్​లోకి చొరబడుతున్న ముగ్గురు పాక్​ స్మగ్లర్లను బీఎస్​ఎఫ్​ బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

narcotic smugglers
ముగ్గురు చొరబాటుదారుల హతం

Narcotic smugglers: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల గుండా భారత్​లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 ప్యాకెట్ల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు.

"కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సరిహద్దు భద్రతా దళం బీఎస్​ఎఫ్​ గుర్తించింది. వారిని లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో వారిని బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 ప్యాకెట్లలో(ఒక్కోటి కిలో) మత్తు మందును స్వాధీనం చేసుకున్నాయి. "

- ఎస్​పీఎస్​ సంధు, డీఐజీ, బీఎస్​ఎఫ్​.

సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లు పెరిగిన క్రమంలో ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని తెలిపారు డీఐజీ.

ఇదీ చూడండి: హిజాబ్ వివాదం- రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం

Last Updated : Feb 6, 2022, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.