ETV Bharat / bharat

'త్వరలోనే పీఓకే స్వాధీనం'.. పాక్​కు రాజ్​నాథ్​ తీవ్ర హెచ్చరికలు - రాజ్​నాథ్ సింగ్ లేటెస్ట్ న్యూస్

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. శ్రీనగర్‌లో నిర్వహించిన 'శౌర్య దివస్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

infantry day 2022
infantry day 2022
author img

By

Published : Oct 27, 2022, 4:29 PM IST

Updated : Oct 27, 2022, 4:54 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని అరాచకాలు జరుగుతున్నాయని.. ఇలా చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్. పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​ను త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీనగర్‌లో నిర్వహించిన 'శౌర్య దివస్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జంట కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్​, లద్దాఖ్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ అభివృద్ధి ప్రస్థానాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లో ఇప్పుడే ప్రారంభించామని.. తమ లక్ష్యమైన గిల్గిట్​, బాల్టిస్థాన్​కు త్వరలోనే చేరుకుంటామని పేర్కొన్నారు.

మానవ హక్కుల పేరిట పాకిస్థాన్ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు రాజ్​నాథ్ సింగ్​. పీఓకే ప్రజల బాధలు వారినే కాకుండా తమను కూడా బాధిస్తాయన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని.. భారత్​పై గురిపెట్టడమే వారి లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్​ 370ని రద్దు చేశామని.. దీని వల్ల జమ్ము కశ్మీర్​ ప్రజలపై జరుగుతున్న వివక్ష అంతమైందన్నారు. శ్యామ్​ప్రసాద్​ ముఖర్జీ చేపట్టిన 'జమ్ము కశ్మీర్​ ఏకతా యజ్ఞం' 2019 ఆగస్ట్ 5న పూర్తైందని పేర్కొన్నారు.

భారత్‌ భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్‌ 27 సైన్యం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లోని 1వ బెటాలియన్‌ అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది. దీనిని పురస్కరించుకొని ఆర్మీ 'ఇన్‌ఫాంట్రీ డే'ను జరుపుకొంటుంది. మరోవైపు ఆ యుద్ధంలో వాయుసేన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్‌ అయింది కూడా అక్టోబర్‌27నే. ఈ నేపథ్యంలో సైన్యం, వాయుసేన కలిసి శౌర్యదివస్‌ను నిర్వహించుకొంటున్నాయి. శ్రీనగర్‌లో వాయుసేన బేస్‌ ఏర్పాటు చేసి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.

ఇవీ చదవండి: గుజరాత్​లో త్రిముఖ పోరు.. దళిత ఓటర్ల దయ ఎటువైపో!

వెబ్​ సిరీస్​ చూసి మర్డర్​ స్కెచ్​.. భార్య ఆత్మహత్యను షూట్​ చేసిన భర్త

Last Updated : Oct 27, 2022, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.