ETV Bharat / bharat

'కశ్మీర్​'పై పాకిస్థాన్​​ శాంతి మంత్రం - india pak shy away talks

కశ్మీర్ సమస్యపై చర్చల విషయంలో భారత్ సంకోచించవద్దని పాకిస్థాన్ కోరింది. చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సమస్యగా పేర్కొన్న పాక్.. ఈ విషయంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చింది.

Pak asks India not to shy away from talks
చర్చల విషయంలో సంకోచం వద్దు: పాక్
author img

By

Published : Mar 6, 2021, 7:42 PM IST

కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ మరోసారి చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ వివాదం చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని పేర్కొంది. చర్చల విషయంపై సంకోచించవద్దని భారత్​ను కోరింది. ఈ విషయంపై పాకిస్థాన్ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చింది. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా 'కశ్మీర్' అంశాన్ని అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సమస్యగా పేర్కొంది పాక్. ఐరాస భద్రతా మండలి తీర్మానాల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

"చర్చల నుంచి దూరం వెళ్లాలనుకునే వారు బలహీనంగా ఉన్నారని అర్థం. మా వైఖరిని బట్టి మేం బలమైన స్థితిలో ఉన్నామని స్పష్టమవుతోంది. కశ్మీర్​ సమస్యపై పాక్​ దృష్టికోణంలో మార్పు లేదు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని నిర్ణయించడం.. మా వైఖరికి అద్దం పడుతోంది. మనకు ఉన్న ఏకైక సమస్య కశ్మీర్. చర్చల ద్వారానే దీన్ని పరిష్కరించుకోగలం. పాకిస్థాన్ చర్చల నుంచి దూరం జరగలేదు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కశ్మీర్ సమస్య సహా అన్ని వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాక్ ఎప్పుడూ చెబుతూ వస్తోంది."

-పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పటిష్ఠంగా అమలు చేయడం వల్ల సరిహద్దులో నివసిస్తున్న కశ్మీరీ ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని పాక్ పేర్కొంది.

భారత్​తో చర్చల విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల శ్రీలంక పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన వేళ.. ఆ దేశ విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.