ETV Bharat / bharat

''పద్మ' పురస్కారం మాకొద్దు'.. మాజీ సీఎం బాటలో మరికొందరు!

author img

By

Published : Jan 26, 2022, 1:49 PM IST

Padma Awards Refused: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను స్వీకరించేందుకు కొందరు నిరాకరిస్తున్నారు. తాజాగా బంగాల్​కు చెందిన ప్రముఖ తబలా వాద్యకారుడు పండిట్​ అనింద్య ఛటర్జీ ఆ జాబితాలో చేరారు.

Padma Awards Refused
Padma Awards Refused

Padma Awards Refused: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను వద్దనుకుంటున్న వారి జాబితా పెరుగుతోంది. ఇప్పటికే పద్మభూషణ్​ పురస్కారాన్ని సీపీఎం సీనియర్​ నేత, బంగాల్​ మాజీ సీఎం బుద్ధదేవ్​ భట్టాచార్య తిరస్కరించారు.

Singing legend Sandhya Mukherjee: అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ స్వీకరించేందుకు నిరాకరించారు. ఇప్పుడు.. బంగాల్​కు చెందిన ప్రముఖ వాద్యకారుడు పండిట్​ అనింద్య ఛటర్జీ తనకు ప్రకటించిన పద్మశ్రీ వద్దంటున్నారు.

పద్మశ్రీ వచ్చినట్లు మంగళవారమే దిల్లీ నుంచి ఫోన్​ వచ్చిందని చెప్పిన అనింద్య.. తన కెరీర్​ ఈ దశలో ఉన్నప్పుడు పద్మశ్రీ అందుకోవడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు.

''నాకు పద్మశ్రీ వచ్చిందని మంగళవారమే దిల్లీ నుంచి ఫోన్​ వచ్చింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించా. నేను వారికి ధన్యవాదాలు చెప్పాను కానీ.. నా కెరీర్​ ఈ దశలో ఉన్నప్పుడు పద్మశ్రీ అందుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఆ ఫేజ్​ ఎప్పుడో దాటేశా.''

- అనింద్య ఛటర్జీ, తబలా వాద్యకారుడు

  • Tabla Maestro Anindya Chatterjee: 10 సంవత్సరాల క్రితమే ఈ పురస్కారం వచ్చి ఉంటే.. ఆనందంగా స్వీకరించేవాడినని అనింద్య అన్నారు. 'ఏదేమైనా నేను అవార్డు తీసుకోను.. క్షమించండి' అని చెప్పారు.
  • పండిట్​ రవిశంకర్​, ఉస్తాద్​ అమ్జద్​ అలీ ఖాన్​, ఉస్తాద్​ అలీ అక్బర్​ ఖాన్​ వంటి మహామహులతో కలిసి పనిచేశారు ఛటర్జీ. 2002లో సంగీత్​ నాటక్​ అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.

90 ఏళ్ల వయసులో.. దాదాపు 8 దశాబ్దాల పాటు పాటలు పాడిన వ్యక్తికి 'పద్మశ్రీ' ప్రకటించడం ఆమె స్థాయిని తగ్గించడమే అని అన్నారు సంధ్యా ముఖర్జీ కుమార్తె సౌమి సేన్​గుప్తా.

Buddhadeb Bhattacharjee News: బుద్ధదేవ్​ భట్టాచార్య కూడా తనను పద్మభూషణ్​ పురస్కారం తీసుకోవాలని సంప్రదించినప్పుడు తిరస్కరించారు. బుద్ధదేవ్​తో పాటు పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం ఒక ప్రకటనలో తెలిపింది. తాము పనిచేసేది ప్రజల కోసమని, అవార్డుల కోసం కాదని ట్విట్టర్​లో పేర్కొంది.

అయితే.. పద్మభూషణ్​ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు బుద్ధదేవ్​ కుటుంబసభ్యులెవరూ తమకు చెప్పలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అవార్డుకు ఎంపికైనవారికి ఆ విషయాన్ని ముందే తెలియజేస్తామని, పురస్కారాన్ని స్వీకరించడం వారికి ఇష్టం లేకపోతే తుది జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తామని వివరించాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: పద్మభూషణ్​ అవార్డును తిరస్కరించిన బంగాల్ మాజీ సీఎం

Padma Awards 2022: పద్మ అవార్డులు వరించింది వీరినే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.