ETV Bharat / bharat

పద్మ అవార్డుల ప్రదానోత్సవం- మోదీ సహా ప్రముఖులు హాజరు - పద్మ అవార్డులు 2021

దిల్లీలోని రాష్ట్రపతి భవనల్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2020లో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Padma Awards ceremony at Rashtrapati Bhavan
పద్మ అవార్డుల ప్రదానోత్సవం-మోదీ సహా ప్రముఖలు హాజరు
author img

By

Published : Nov 8, 2021, 11:18 AM IST

Updated : Nov 8, 2021, 4:45 PM IST

పద్మ అవార్డుల ప్రదానోత్సవం

2020కిగాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అందజేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్​ షా సహా ఇతర ముఖ్య నేతలు, ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్​, పద్మ విభూషణ్​తో కేంద్రం ఏటా సత్కరిస్తోంది. అవార్డు ప్రదానోత్సవంలో మొత్తం 73మందికి పురస్కారాలు అందజేసినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటనలో తెలిపింది. ఇందులో నాలుగురికి పద్మ విభూషణ్​, 8 మందికి పద్మ భూషణ్, 61 మందికి పద్మశ్రీ ఇచ్చినట్లు పేర్కొంది.

మరణానంతరం కేంద్ర మాజీమంత్రులు అరుణ్‌ జైట్లీ, సుష్మస్వరాజ్, జార్జ్‌ ఫెర్నాండేజ్‌కు పద్మవిభూషణ్‌ పురస్కారాలు దక్కాయి. జార్జ్‌ ఫెర్నాండేజ్‌ తరఫున ఆయన భార్య లీలా కబీర్‌ ఫెర్నాండేజ్‌ అవార్డును అందుకున్నారు. అరుణ్‌ జైట్లీ తరఫున ఆయన సతీమణి సంగీతా జైట్లీ పురస్కారాన్ని తీసుకున్నారు. సుష్మ స్వరాజ్‌ తరఫున ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ అవార్డును అందుకున్నారు.

Padma Awards ceremony at Rashtrapati Bhavan
సుష్మా స్వరాజ్ తరఫున పద్మవిభూషణ్​ అవార్డు అందుకుంటున్న ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్​

అరుణ్‌ జైట్లీ తరఫున ఆయన సతీమణి సంగీతా జైట్లీ పురస్కారాన్ని తీసుకున్నారు

జార్జ్‌ ఫెర్నాండేజ్‌ తరఫున ఆయన భార్య లీలా కబీర్‌ ఫెర్నాండేజ్‌ అవార్డును అందుకున్నారు

పద్మ అవార్డులు తీసుకున్న ప్రముఖులలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ, భారత మహిళ హాకీ జట్టు కెప్టెన్​ రాణి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ ఉన్నారు.

పద్మభూషణ్ అవార్డు తీసుకుంటున్న స్టార్ షట్లర్ పీవీ సింధు

పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న బాలీవుడ్​ స్టార్ నటి కంగనా రనౌత్​

పద్మశ్రీ అవార్డు తీసుకుంటున్న భారత మహిళల ఫుట్​బాల్ జట్టు మాజీ కెప్టెన్​ ఓయినం బెంబెం

పద్మశ్రీ అందుకుంటున్న భారత హాకీ మహిళా జట్టు కెప్టెన్​ రాణి

పద్మశ్రీ అందుకుంటున్న బాలీవుడ్ ప్రముఖ సింగర్ అద్నాన్ సమి

పద్మవిభూషణ్ అందుకుంటున్న హిందుస్తాని క్లాసికల్ సింగర్​ పండిట్​ చన్నులాల్ మిశ్ర

పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న ఎయిర్ మార్షల్​ డా.పద్మ బందోపాధ్యాయ్​

పద్మశ్రీ అవార్డు తీసుకుంటున్న భారత ఆర్చర్​, తరుణ్​దీప్ రాయ్​

పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న పారిశ్రమికవేత్త జై ప్రకాశ్​ అగర్వాల్​

మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ అందుకుంటున్న డా. బెనర్జీ

పద్మ అవార్డు గ్రహీతలతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రహోంమంత్రి ఫొటో

ఇదీ చదవండి: 94వ పడిలోకి అడ్వాణీ- వెంకయ్య, మోదీ శుభాకాంక్షలు

Last Updated : Nov 8, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.