ETV Bharat / bharat

థాయ్ నుంచి భారత్​కు ఆక్సిజన్ కంటైనర్లు - భారత్

థాయ్​లాండ్ నుంచి ఖాళీ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్లు దేశానికి చేరుకున్నాయి. వాయుసేన విమానంలో ఇవి బంగాల్​కు వచ్చాయి. ఇది విదేశాల నుంచి వచ్చిన మూడో సరకు రవాణా విమానమని కేంద్రం తెలిపింది.

Oxygen tankers
ఆక్సిజన్ సిలిండర్
author img

By

Published : Apr 27, 2021, 4:52 PM IST

Updated : Apr 27, 2021, 7:01 PM IST

థాయ్​లాండ్ నుంచి మెడికల్ ఆక్సిజన్ కంటైనర్లు(ఖాళీవి) వాయుసేన విమానంలో భారత్​కు చేరుకున్నాయి. ఇది విదేశాల నుంచి వచ్చిన మూడో సరకు రవాణా విమానం అని కేంద్ర హోంశాఖ తెలిపింది.

సింగపూర్​ నుంచి శనివారం తొలి ఆక్సిజన్ కంటైనర్ల కన్సైన్​మెంట్ రాగా.. దుబాయ్ నుంచి సోమవారం మరో బ్యాచ్ కంటైనర్లను తీసుకొచ్చారు. ఇవన్నీ బంగాల్​కు చేరుకున్నాయి. వీటిని ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కేంద్రాలకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి డిమాండ్ ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తారు.

రెండో దశలో భాగంగా దేశంలో మెడికల్ ఆక్సిజన్​కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాను పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. ఖాళీ కంటైనర్లను పెద్ద ఎత్తున సమకూర్చుకొని ఆక్సిజన్ పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి: దిల్లీకి 70 టన్నుల ఆక్సిజన్​

Last Updated : Apr 27, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.