ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై కన్నేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(asaduddin owaisi).. 2022 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని (up election 2021) అయోధ్య నుంచి ప్రారంభించనున్నారు. 'వంచిత్-శోషిత్ సమాజ్' (అణగారిన వర్గాలు) పేరిట నిర్వహించే కాన్ఫరెన్స్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పర్యటన కోసం యూపీకి (Owaisi in UP) చేరుకున్న ఆయన.. లఖ్‌నవూలో విలేకరులతో మాట్లాడారు. యూపీ ఎన్నికల్లో (asaduddin owaisi UP election) పోటీ చేసి.. గెలుస్తామని ధీమాగా చెప్పారు.
"మేం ఎన్నికల్లో పోటీ చేస్తాం, గెలుస్తాం. ఉత్తర్‌ప్రదేశ్ ముస్లింలు గెలుస్తారు. యూపీలో భాజపాను ఓడించడమే మా లక్ష్యం."
-అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు
అయోధ్యకు 57 కి.మీ దూరంలోని రుదౌలీ తెహసీల్‌లో ఒవైసీ సభ జరగనుంది. ఈ కార్యక్రమం పోస్టర్లలో అయోధ్య జిల్లాను ఫైజాబాద్‌గా పేర్కొనడంపై ఇప్పటికే పార్టీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎం ర్యాలీపై నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఫైజాబాద్ జిల్లా పేరును 2018లోనే అయోధ్యగా మార్చారు.
'మద్దతు పెరుగుతోందనే'
ఈ నేపథ్యంలో స్పందించిన ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ (aimim up president).. తమకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని విపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయని చురకలు అంటించారు. కాన్ఫరెన్స్‌కు ముస్లింలు, దళితులు, బీసీలతో పాటు అగ్రవర్ణ హిందువులను సైతం ఆహ్వానించినట్లు చెప్పారు. భాజపా హయాంలో ముస్లింలతో పాటు వీరంతా వేధింపులకు గురయ్యారని ఆరోపించారు.
"ముస్లింల హక్కుల కోసం మాత్రమే ఎంఐఎం పార్టీ పోరాడటం లేదు. భాజపా పాలనలో అన్ని వర్గాలు వేధింపులకు గురయ్యాయి. భాజపా, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. ఈ పార్టీలన్నీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. యూపీ ఎన్నికల్లో గెలిస్తే అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తాం."
-షౌకత్ అలీ, ఎంఐఎం యూపీ అధ్యక్షుడు
సుమారు వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫీల్డ్ అభ్యర్థులను ఎంఐఎం పార్టీ (mim in up election) ప్రకటించింది. భాగీదారీ సంకల్ప్ మోర్చ పేరుతో అనేక చిన్నపార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. ఇందులో ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, బాబు సింగ్ కుష్వాహాకు చెందిన జన్ అధికార్ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్ పార్టీ, రాష్ట్రీయ ఉపేక్షిత్ సమాజ్ పార్టీ, జనతా క్రాంతి పార్టీలు ఉన్నాయి.
ఇదీ చదవండి: వేడెక్కిన రాజకీయం- చిన్న పార్టీలతోనే అసలు చిక్కులు