అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.1,511కోట్ల విరాళాలు వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ 'ఈటీవీ భారత్'తో తెలిపారు. ఈ మొత్తం ఫిబ్రవరి 11 సాయంత్రం నాటికి అందినట్లు వెల్లడించారు.
మొదట ఈ ఆలయ నిర్మాణానికి రూ.1,100కోట్లకు పైగా ఖర్చవుతుందని ట్రస్ట్ అంచనా వేసింది. ఆలయ నిర్మాణం కోసం చుట్టుపక్కల ఉన్న భూమిని కూడా కొనడానికి ట్రస్ట్ ప్రయత్నిస్తోందని, అందుకే ఖర్చు ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువే కావచ్చన్నారు.
అయితే ఆలయ నిర్మాణం మూడున్నరేళ్లలో పూర్తికాకున్నా బాల రాముడి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిస్తామని స్వామి గోవింద్ తెలిపారు.
ఇదీ చూడండి: 'రామ మందిర నిర్మాణానికి రూ.1000కోట్ల విరాళాలు'