దేశంలో 8 కోట్లకుపైగా కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళలోనే 60 శాతం వ్యాక్సిన్లను అందించినట్లు తెలిపింది.
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్లలో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన 1,03,558 కొత్త కేసుల్లో 81.90 శాతం ఆ రాష్ట్రాల్లోనే వెలుగు చూశాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,41,830 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో కొత్తగా 47వేల మందికి కరోనా