ETV Bharat / bharat

టీకా పంపిణీలో భారత్​ సరికొత్త రికార్డులు

author img

By

Published : Jan 31, 2021, 1:41 PM IST

దేశంలో కొవిడ్​ మహమ్మారిని అంతం చేసే దిశగా చేపట్టిన వ్యాక్సినేషన్​ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటి వరకు 37 లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా పంపిణీ విషయంలో అమెరికా, బ్రిటన్​ వంటి దేశాలను వెనక్కి నెట్టి కొత్త రికార్డులను భారత్​ నమోదు చేసింది.

vaccianation in india
వ్యాక్సినేషన్​లో భారత్​ నయా రికార్డులు

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చేపట్టిన తొలి దశ టీకా పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే.. 37 లక్షల మందికిపైగా వ్యాక్సిన్‌ను అందచేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా 10, 20, 30 లక్షల కొవిడ్‌ టీకాల లక్ష్యాలను, అతి తక్కువ సమయంలో చేరుకున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించినట్టు ఈ సందర్భంగా వెల్లడైంది. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రాథమిక నివేదికలో.. కరోనా టీకాలను తీసుకున్న వారి సంఖ్య శనివారం రాత్రి ఏడు గంటలకు 37,01,157గా నమోదైనట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఆరు రోజుల్లోనే..

పది లక్షల మార్కును అమెరికా 10 రోజుల్లో, బ్రిటన్‌ 18 రోజుల్లో చేరుకోగా.. మనం ఈ ఘనతను కేవలం ఆరు రోజుల్లోనే సాధించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌‌ వివరించారు. అంతేకాకుండా ఇరవై లక్షలు, ముప్ఫై లక్షల కొవిడ్‌ టీకాలను అతి వేగంగా అందజేసిన రికార్డు కూడా మన దేశానిదే అని కేంద్రం వెల్లడించింది.

మన దేశంలో జనవరి 16న ప్రారంభమైన కొవిడ్‌ టీకా కార్యక్రమం.. గత పదిహేను రోజులుగా కొనసాగుతోంది. కాగా, ఇతర దేశాలు.. నలభై నుంచి యాభై రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 71 ప్రదేశాల్లో టీకాలు వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా గమనించినట్లయితే.. 4,63,793 మంది వ్యాక్సిన్‌ లబ్ధిదారులతో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. కాగా, రాజస్థాన్‌ (3,26,745), కర్ణాటక (3,15,343), మధ్యప్రదేశ్‌ (2,73,872), మహారాష్ట్ర (2,69,064) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి:దేశంలో మరో 13,052 కేసులు..127 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.