ETV Bharat / bharat

వేలాడే వంతెన కూలి 30మంది విద్యార్థులకు గాయాలు! - అసోం కరీంగంజ్​ వార్తలు

అసోంలోని కరీంగంజ్​ జిల్లాలో (Karimganj News) వంతెన కూలి 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. చెరాగ్​లోని సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Karimganj News
వేలాడే వంతెన కూలి 30మంది విద్యార్థులకు గాయాలు!
author img

By

Published : Oct 5, 2021, 10:06 PM IST

అసోంలోని కరీంగంజ్​ జిల్లాలో కూలిన వంతెన

అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో (Karimganj News) ప్రమాదం చోటుచేసుకుంది. నదిపై వేలాడే వంతెన కూలిపోవడం వల్ల 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రాటాబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరాగి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెరాగి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే సింగ్లా నదిపై ఉన్న ఈ వేలాడుతున్న వంతెనను దాటాల్సి ఉంటుంది. ఈ నది చెరాగి ప్రాంతాన్ని అక్కడి గ్రామంతో కలుపుతుంది. అయితే, కొన్నేళ్లుగా విద్యార్థులు, ప్రజలు పాఠశాలలకు.. ఇతర ప్రాంతాలకు ఇదే వంతెన నుంచి వెళ్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం చెరాగి విద్యాపీఠ్‌ హైస్కూల్‌ విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు సింగ్లా నదిని (Karimganj News) దాటేందుకు ప్రయత్నించగా.. అది అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల అనేకమంది విద్యార్థులు నదిలో పడిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని విద్యార్థులను కాపాడారు. ఈ ఘటనలో దాదాపు 30మంది విద్యార్థులు గాయపడగా.. వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ వేలాడే వంతెనను మూడేళ్ల క్రితమే నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చూడండి : 'రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో'.. సిద్ధూ వార్నింగ్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.