దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. మొత్తంగా 3.89 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 17 లక్షల 83 వేల 303 డోసుల టీకా వేసినట్లు వెల్లడించింది.
ఇప్పటివరకు 76 లక్షల 19 వేల 786 మంది ఆరోగ్య సిబ్బందికి, 78 లక్షల 11 126 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలిడోసు టీకా అందించినట్లు పేర్కొంది. 46 లక్షల 92 వేల 962 మంది ఆరోగ్య సిబ్బంది, 21 లక్షల 50 వేల 198 మంది ఫ్రంట్‌లైన్ సిబ్బంది రెండో డోసు టీకాను అందుకున్నట్లు తెలిపింది.
కోటీ 39 లక్షల 18 వేల మంది వృద్ధులకు టీకా అందించగా.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు.. 45 ఏళ్లుపైబడిన 27 లక్షల 27 వేల 942 మంది టీకాను పొందారు.
ఇదీ చదవండి: 'మహా'పై కరోనా పంజా- రికార్డు స్థాయిలో కొత్త కేసులు