ETV Bharat / bharat

అఫ్గాన్​లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి ఏంటి?

author img

By

Published : Aug 16, 2021, 6:50 PM IST

Updated : Aug 16, 2021, 7:41 PM IST

అఫ్గానిస్థాన్​లో భారత్​కు చెందిన 200 మంది చిక్కుకున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే వీరిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేసింది.

Indians Still Inside Kabul Embassy
భారతీయుల పరిస్థితి ఏంటి

తాలిబన్ల ఆక్రమణతో ఆందోళనకరంగా మారిన అఫ్గాన్​ పరిస్థితులను.. భారత అత్యున్నతస్థాయి రక్షణాధికారులు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్​లో చిక్కుకున్న భారత రాయబార కార్యాలయం సిబ్బంది, భద్రతా సిబ్బందితో పాటు దాదాపు 200మంది భారతీయులను త్వరితగతిన వెనక్కి తీసుకురావడమే ప్రస్తుతమున్న లక్ష్యంగా వారు భావిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళం ఆందోళనలు కలిగిస్తోంది. దేశాన్ని వీడేందుకు ప్రజలు భారీస్థాయిలో విమానాశ్రయానికి తరలివెళుతున్నారు. పరిస్థితులు క్షణక్షణానికి దారుణంగా మారుతున్న నేపథ్యంలో కాబుల్​లోని భారత రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని విమానాశ్రయానికి తీసుకురావడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల వల్లే.. భారత్​ నుంచి విమానాలు పంపించడంలో జాప్యం ఏర్పడుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏ క్షణంలోనైనే ఎగిరేందుకు సీ-17 గ్లోబ్​మాస్టర్​ వంటి భారీస్థాయి ఎయిర్​క్రాఫ్ట్​లు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

విమానాశ్రయంలో గందరగోళం కారణంగా కాబుల్​కు వెళ్లాల్సి వాణిజ్య విమానం కూడా రద్దు అయినట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ క్రమంలో భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

"పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. అఫ్గాన్​లో భారతీయుల భద్రతకు అన్నివిధాలుగా కృషిచేస్తాము. అఫ్గాన్​లోని సిక్కులు, హిందు సంఘాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాము. అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడేందుకు వీలుగా కొన్ని ఫోన్​ నెంబర్లు పంపించాము. అఫ్గాన్​ను వీడి దేశానికి వచ్చేయాలి అని అనుకుంటున్న వారిని తరలించే ప్రయత్నంలో ఉన్నాము. భద్రతకు సంబంధించి సమయానుగుణంగా ఆదేశాలు జారీచేస్తాము."

-- భారత విదేశాంగశాఖ.

'చర్యలు చేపట్టాలి...'

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పొరుగు దేశాలతో భారతీయ విదేశాంగ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎన్​సీపీ అధినేత శరత్​ పవార్​ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల అవసరాల దృష్ట్యా భారత్​ అప్రమత్తంగా వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాకుండా పాకిస్థాన్​, చైనాలతో తప్ప పొరుగున ఉన్న ఇతర దేశాలతో మనకు సత్​సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. అఫ్గాన్​ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని స్పష్టం చేశారు పవార్​.

'వారిని వెంటనే భారత్​కు రప్పించాలి..'

అఫ్గానిస్థాన్​లోని గురుద్వార్​లో చిక్కుకున్న 200 మంది సిక్కులతో సహా భారతీయులందరినీ మన దేశానికి తరలించే ఏర్పాటు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్​ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకుగానూ తమ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:

అఫ్గాన్​.. బానిసత్వ సంకెళ్లు తెంచుకుంది: ఇమ్రాన్

తాలిబన్ల పాలన షురూ- చక్రం తిప్పేది ఆ నలుగురే!

అఫ్గాన్​ లో సిటీ బస్సులు- విమానాలు ఒకటే!

తాలిబన్లు అంత సంపన్నులా? రూ.వేల కోట్లు ఎలా సంపాదించారు?

Last Updated : Aug 16, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.