ETV Bharat / bharat

కుంభమేళాలో 1,701 కరోనా కేసులు

author img

By

Published : Apr 15, 2021, 2:52 PM IST

కుంభమేళాలో 1,701 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆర్​టీపీసీఆర్​ ద్వారా జరిపిన పరీక్షల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. వాటి ఫలితాలు వస్తే.. కేసుల సంఖ్య 2 వేలు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

COVID-19 in Kumbh Mela
కుంభమేళలో కరోనా కేసులు

కుంభమేళాలో ఏప్రిల్​ 10 నుంచి ఏప్రిల్​ 14 మధ్య 1,701 కరోనా కేసులు నమోదయ్యాయి. కుంభమేళా కొనసాగిన హరిద్వార్ నుంచి దేవప్రయాగ వరకు ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక కారణంగా కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఆర్​టీపీసీఆర్​ ద్వారా జరిపిన పరీక్షల్లో కొన్నింటి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. వాటిని పరిగణలోకి తీసుకుంటే కొత్త కేసుల సంఖ్య రెండు వేలు దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఏప్రిల్​ 12, 14 తేదీల్లో జరిగిన పవిత్ర స్నానాల్లో భక్తులు.. కరోనా నియమాలను ఉల్లంఘించారు. ఈ రెండు రోజుల్లో 48.05 లక్షల మంది కుంభమేళాలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్​ తొలగించిన వార్డ్​ బాయ్​- కొవిడ్​ రోగి మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.