దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు 1.23 కోట్ల డోసులను వైద్య సిబ్బందికి, కరోనా యోధులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,23,66,633 డోసులను 2,63,224 సెషన్లలో పంపిణీ చేశామని పేర్కొంది.
వైద్య సిబ్బందిలో 65.24 లక్షల మందికిపైగా తొలి డోసు అందుకోగా, 14.81 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. కరోనా యోధుల్లో 43.60 లక్షల మంది తొలి డోసు అందుకున్నారు.
భారత్లో టీకా పంపిణీ జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలకు ప్రారంభం కాగా, ఈనెల 2 నుంచి కరోనా యోధులకు కూడా ఇస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే దిల్లీలోకి ఎంట్రీ