ETV Bharat / bharat

1.19 కోట్ల టీకా డోసుల పంపిణీ: కేంద్రం - ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ

కరోనా టీకాల పంపిణీలో అత్యవసర సిబ్బందికి ఇప్పటివరకు 1.19 కోట్ల డోసులు అందాయని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్​ పంపిణీ విస్తృతం చేసేందుకు మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను భాగస్వాములగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

tika, vaccine
'కోటికిపైగా అత్యవసర సిబ్బందికి టీకాలు అందాయి'
author img

By

Published : Feb 24, 2021, 8:00 AM IST

ఇప్పటివరకు 1.19 కోట్ల టీకా ​ డోసులను ఆరోగ్య కార్యకర్తలు, కరోనా యోధులకు అందించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,19,07,392 డోసులు 2,53,434 సెషన్లలో పంపిణీ చేశామని పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తల్లో 64.71 లక్షల మంది తొలి డోసు అందుకోగా, 13.21 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. కరోనా యోధుల్లో 41.14 లక్షల మంది తొలి డోసు అందుకున్నారు. టీకా పంపిణీ జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలకు ప్రారంభం కాగా, ఈనెల 2న కరోనా యోధులకు అందుబాటులోకి వచ్చింది.

ప్రైవేటు ఆస్పత్రులకు..

వ్యాక్సిన్​ పంపిణీ విస్తృతం చేసేందుకు మరిన్ని ప్రైవేటు అస్పత్రులను భాగస్వామ్యం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం 10వేల ఆస్పత్రులలో టీకా పంపిణీ జరుగుతోందని అందులో రెండు వేల ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి : అసోంలో 1,050 మంది మిలిటెంట్ల లొంగుబాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.