ETV Bharat / bharat

PFIZER: '12 ఏళ్లు పైబడిన వారికి మా టీకా సురక్షితం' - pfizer vaccine covid

దేశంలో విజృంభిస్తున్న కరోనా వేరియంట్​పై తమ టీకా(vaccine) సమర్థవంతంగా పనిచేస్తుందని కేంద్రానికి తెలిపింది ఆమెరికాకు చెందిన ఫైజర్(pfizer)​ సంస్థ. భారత్​లో అత్యవసర వినియోగానికి (Emergency Use Authorisation) అనుమతులు ఇస్తే.. జులై అక్టోబర్​ మధ్యకాలంలో 5 కోట్ల డోసులను అందిస్తామని స్పష్టం చేసింది.

Pfizer
'12ఏళ్లు పైబడిన వారిపై సమర్థవంతంగా ఫైజర్​'
author img

By

Published : May 27, 2021, 7:19 AM IST

అమెరికాకు చెందిన కరోనా వ్యాక్సిన్ (covid vaccine) ఫైజర్​.. భారత్​లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కొవిడ్​ వేరియంట్​లో ఒకటైన సార్స్​- కోవ్​-2ను తమ టీకా సమర్థవంతంగా ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ వ్యాక్సిన్ 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సురక్షితమని పేర్కొంది. అంతేగాక నిల్వచేసుకోవడం(storage) కూడా మిగతా టీకాలతో పోల్చితే మరింత సులభమని వివరించింది. నెల పాటు 2 నుంచి 8 డిగ్రీల వద్ద దీనిని భద్రపరుచుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ ఏడాది జులై, అక్టోబర్ మధ్య కాలంలో భారత్​కు 5 కోట్ల డోసులను అందించడానికి ఫైజర్(pfizer)​ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే పలుమార్లు భారత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో సమావేశం అయిన ఫైజర్​ ప్రతినిధులు.. కరోనాపై టీకా ఏవిధంగా పనిచేస్తుందనే అంశాన్ని వివరించారు. ఈ వ్యాక్సిన్​ వినియోగానికి ఇతర దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇదీ చూడండి: 'మా టీకా పిల్లలపై పనిచేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.