ETV Bharat / bharat

'సంస్కరణలపై అనుమానాలు సహజం- రైతు సంక్షేమమే ధ్యేయం' - కోవింద్​ గణతంత్ర దినోత్సవ ప్రసంగం

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామన్​నాథ్​ కోవింద్​. వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలపై తొలినాళ్లల్లో సందేహాలు ఉండటం సహజమేనని.. అయితే రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

Our farmers, soldiers and scientists deserve special appreciation and a grateful nation greets them on this auspicious occasion of the Republic Day: President Ram Nath Kovind
'రైతులు, శాస్త్రవేత్తలు, సైనికులకు ధన్యవాదాలు'
author img

By

Published : Jan 25, 2021, 7:20 PM IST

Updated : Jan 25, 2021, 8:09 PM IST

వ్యవసాయం, కార్మిక రంగాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న సంస్కరణలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వెల్లడించారు. అయితే సంస్కరణలపై తొలుత భేదాభిప్రాయాలు తలెత్తినా.. రైతుల సంక్షేమం కోసమే సాగు చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు.

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు కోవింద్​. కొన్ని సందర్భాల్లో తలెత్తే ప్రతికూలతలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయని.. అవే మనల్ని మరింత శక్తివంతంగా తీర్చుదిద్దుతాయని అభిప్రాయపడ్డారు. వీటితో విశ్వాసం పెరుగుతుందన్నారు.

"ఈ విశ్వాసంతో అనేక రంగాల్లో భారత్​ ముందడుగు వేసింది. ఎన్నో ఏళ్లుగా చేపట్టాల్సిన సంస్కరణలు ఇప్పుడు చట్టాల రూపంలో వచ్చాయి. ఆర్థిక సంస్కరణలకు ఇవి ఊతమందిస్తాయి. అయితే తొలినాళ్లల్లో ఈ సంస్కరణలపై భేదాభిప్రాయాలు ఉన్నా.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు."

--- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి.

ఈ నేపథ్యంలో రైతులు, శాస్త్రవేత్తలు, సైనికులపై కోవింద్​ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా సంక్షోభంలోనూ రైతులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చారని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా చూసుకున్నారని ప్రశంసించారు.

అతి తక్కువ కాలంలో కొవిడ్​-19కు టీకా తీసుకొచ్చి మానవాళికి శాస్త్రవేత్తలు సహాయం చేశారని పేర్కొన్నారు కోవింద్​. వారి సేవలను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. ఇతర దేశాల కన్నా భారత్​లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటాని శాస్త్రవేత్తలు, వైద్యులే కారణమన్నారు.

మరోవైపు సియాచిన్​, గల్వాన్​ లోయలో నిరంతరం సైనికులు దేశ సరిహద్దును పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలోనూ విధులు నిర్వర్తిస్తుండటంపై గొప్ప విషయమన్నారు.

ఇదీ చూడండి:- 'ఓటు హక్కును ప్రతి ఒక్కరు గౌరవించాలి'

Last Updated : Jan 25, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.