ETV Bharat / bharat

సాగు చట్టాలపై దుమారం- రాజ్యసభ రేపటికి వాయిదా - Rajya Sabha session news

రైతు ఉద్యమం రాజ్యసభను తాకింది. వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలపై చర్చించాలంటూ విపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. మూడు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభైనా విపక్షాలు పట్టు వీడలేదు. దీంతో సభను బుధవారం ఉదయం 9 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించి సభా గౌరవాన్ని కాపాడాలని సభ్యులకు సూచించారు.

Opposition walks out of Rajya Sabha
రాజ్యసభను తాకిన రైతు ఆఁదోళనలు
author img

By

Published : Feb 2, 2021, 10:25 AM IST

Updated : Feb 2, 2021, 1:40 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు రాజ్యసభను తాకాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే రైతు ఉద్యమం, సాగు చట్టాలపై చర్చించాలంటూ ఛైర్మన్​ వెంకయ్య నాయుడుకు విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. రైతుల ఆందోళనలపై చర్చ బుధవారం ఉంటుందని.. ఇవాళ కాదని వెంకయ్య బదులిచ్చారు. మంగళవారం సాయంత్రం ఈ వ్యవహారంపై లోక్​సభ చర్చిస్తుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ఇందుకు విపక్ష నేతలు అంగీకరించలేదు. రైతుల ఉద్యమంపై చర్చకు పట్టుబట్టారు. వీరి గందరగోళం నడుమే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు కొనసాగించారు వెంకయ్య. నిరసనగా పలువురు విపక్ష నేతలు వాకౌట్​ చేయగా.. మరికొందరు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు.

విపక్షాల ఆందోళనతో సభను 10:30 వరకు వాయిదా వేశారు వెంకయ్య. అనంతరం సభ ప్రారంభమైనా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. దీంతో మళ్లీ 11:30 వరకు వాయిదా వేశారు. అనంతరం సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో మార్పులేదు. ఫలితంగా సభ మూడోసారి 12:30 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సాగు చట్టాలపై చర్చ తక్షణమే జరపాలని సభ వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభను బుధవారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్ నారాయణ్​ ప్రకటించారు.

సభా గౌరవాన్ని కాపాడాలి..

అంతకుముందు... రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. కీలక విషయాలపై చర్చించేటప్పుడు నిబంధనలు పాటించి సభా గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు. గత సెషన్​లో వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. అలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు.

2019 సెప్టెంబర్​లో సాగు చట్టాల ఆమోద సమయంలో సభలో గందరగోళం సృష్టించారు విపక్ష సభ్యులు. రూల్​ బుక్స్​ను చింపేశారు. పోడియంపైకి ఎక్కి బీభత్సం చేశారు.

ఇదీ చూడండి: '50 శాతం మంది జీవన ప్రమాణాల్లో క్షీణత'

Last Updated : Feb 2, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.