ETV Bharat / bharat

బడ్జెట్​తో ప్రయోజనం శూన్యం: విపక్షాలు

రాజ్యసభలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఈ బడ్జెట్​తో ఎలాంటి ఉపయోగం లేదని పలువురు నేతలు పేర్కొనగా, ఇది ధనికులను మరింత ధనవంతులు చేయడం కోసమేనని మరికొందరు వ్యాఖ్యానించారు.

budget, opposition
బడ్జెట్​తో ఏం ప్రయోజనం లేదు : ప్రతిపక్షాలు
author img

By

Published : Feb 12, 2021, 4:55 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్... పెట్టుబడిదారులకు మాత్రమే మేలు చేసేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి. బడ్జెట్​పై రాజ్యసభలో చర్చ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.

నోట్ల రద్దు, జీఎస్​టీ వంటి నిర్ణయాలతో దేశం ఇప్పటికే సతమతం అవుతోంది. కేంద్రం సంపన్నులకు ప్రోత్సాహం అందిస్తూ పేద వారిని ఆత్మ నిర్భర్​ అవమంటోంది. రాష్ట్రాల పన్ను వాటాను తగ్గించేందుకు కేంద్రం సెస్ విధిస్తోంది.

-శక్తిసింగ్ గొహిల్​, కాంగ్రెస్​ నేత

ఆత్మనిర్భర్​ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​ను వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వాణిజ్య రంగానికి దాసోహమనడమేనా ఆత్మనిర్భర్ భారత్​​ అంటే? ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించకండి.

-బినోయ్​ బిశ్వమ్​, సీపీఐ నేత

మహమ్మారిని ఎదుర్కోవడానికి తగినట్టు ఈ బడ్జెట్​ను రూపొందించారు. కానీ ప్రైవేటీకరణ అన్ని రంగాలకు మేలు చేయదు. ప్రైవేటు సంస్థలు గుత్తాధిపత్యం చేసే అవకాశం ఉంటుంది.

-హెచ్​డీ దేవ గౌడ, జేడీఎస్

ఇందులో సామాన్యుడికి ఒరిగేది ఏం లేదు. దేశ ఆస్తులను, ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మడమే బడ్జెట్​లో కనిపిస్తోంది. కేంద్రం ధనికులను మరింత ధనవంతులని, పేదవారిని మరింత పేదవారిని చేయాలనుకుంటోంది. పేదలు, దళితుల హక్కులు పారిశ్రామికవేత్తలు ఇవ్వడం భావ్యం కాదు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలి.

-అశోక్​ సిద్ధార్థ్​, బీఎస్​పీ

క్యాన్సర్​ చికిత్స కోసం దిగుమతి చేసుకునే యంత్రాలపై కస్టమ్స్​ సుంకాన్ని తగ్గించాలని బీఎస్​పీ నేత సతీశ్ చంద్ర మిశ్రా డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : ఆత్మనిర్భర్​ భారత్​ లక్ష్యంగానే బడ్జెట్​: నిర్మల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.