ETV Bharat / bharat

'జాతి ప్రయోజనాల కోసమే విపక్షాల ఐక్యత.. 17 పార్టీలు కలిసి పోటీ.. త్వరలో మరో భేటీ'

Opposition meeting in Patna : బీజేపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో పోరాడతాయని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ తెలిపారు. త్వరలోనే మరోసారి భేటీ అవుతామని చెప్పారు. వచ్చే సమావేశంలో ఉమ్మడి అజెండాను రూపొందించుకుంటామని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎన్ని విభేదాలు ఉన్నా.. కలిసే పోరాడతామని బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే, ఒంటరిగా పోరాడటం చేతగాకే.. ఇతర పార్టీల మద్దతును కాంగ్రెస్ కోరుతోందని బీజేపీ విమర్శించింది.

opposition-meeting-in-patna
opposition-meeting-in-patna
author img

By

Published : Jun 23, 2023, 5:01 PM IST

Updated : Jun 23, 2023, 9:15 PM IST

Opposition meeting in Patna : సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడాలని విపక్ష పార్టీలన్నీ నిర్ణయించినట్లు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 17 పార్టీలు కలిసే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. విపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని అన్న ఆయన.. వివిధ పార్టీల నేతలు సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు చెప్పారు.

బీజేపీ సర్కారును గద్దెదించేందుకు విపక్షాలను ఏకం చేయడమే లక్ష్యంగా పట్నాలో 15 పార్టీలు భేటీ అయ్యాయి. చర్చల అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఇందులో మాట్లాడిన నీతీశ్.. త్వరలోనే మరోసారి విపక్షాల భేటీ జరుగుతుందని తెలిపారు. తదుపరి విపక్ష సమావేశం కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్​ప్రదేశ్​లోని శిమ్లాలో నిర్వహించనున్నట్లు చెప్పారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే తామంతా కలిసినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారని ధ్వజమెత్తారు.

'త్వరలోనే ఉమ్మడి అజెండా'
Opposition unity Rahul Gandhi : 2024 లోక్​సభ ఎన్నికల కోసం ఉమ్మడి అజెండాను వచ్చే సమావేశంలో నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాలవారీగా వేర్వేరు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. మరోవైపు, విపక్ష పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయన్న రాహుల్ గాంధీ.. తమ భావజాలాన్ని కాపాడుకుంటూనే వాటిని పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు.

opposition-meeting-in-patna
భేటీ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్​లో రాహుల్, ఖర్గే

'ప్రజా ఉద్యమంగా మారుతుంది'
Mamata Banerjee news : పట్నా నుంచి ఏది మొదలైనా.. అది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా తామంతా ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉమ్మడిగానే కాషాయ పార్టీని ఎదుర్కొంటామని ప్రకటించారు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కానీ అది జరగకుండా తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

"మేం విపక్ష పార్టీలు మాత్రమే కాదు.. దేశ భక్తులం కూడా. విభేదాలున్నా మేమంతా ఐక్యంగా పోరాడతాం. ఎన్నికైన ప్రభుత్వాలపై రాజ్‌భవన్‌ను ప్రయోగిస్తున్నారు. రాజ్‌భవన్‌ కేంద్రంగా ప్రత్యామ్నాయ పాలన సాగిస్తున్నారు. సీబీఐ, ఈడీ దాడులతో బెదిరింపులకు దిగుతున్నారు. సామాన్యుల బాధలు కేంద్రానికి పట్టవు. రాష్ట్రాలకు నిధుల విడుదలలోనూ పక్షపాతమే. భాజపా నల్ల చట్టాలను ప్రయోగిస్తోంది. అధికారంలోకి రాగానే నల్ల చట్టాలను రద్దు చేస్తాం."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి: ఒమర్
Opposition unity 2024 : కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 17 పార్టీలు ఈ భేటీకి వచ్చాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. వీరంతా అధికారం కోసం ఏకం కాలేదని.. సిద్ధాంతం కోసం ఒక్కటయ్యారని చెప్పారు. 'దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలి. నేను, మెహబూబా ముఫ్తీ ప్రజాస్వామ్యం హత్యకు గురైన ప్రాంతం నుంచి వచ్చాం. నిన్న అమెరికా శ్వేతసౌధంలో ప్రజాస్వామ్యం గురించి చర్చలు జరిగాయి. మరి ఆ ప్రజాస్వామ్యం జమ్ము కశ్మీర్​ వరకు ఎందుకు రావడం లేదు?' అని ప్రశ్నించారు.

ఎవరు ఏమన్నారంటే..?

  • జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలానే తమ కూటమికి ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
  • గాంధీ భారత్​ను.. గాడ్సే భారత్​గా మారనీయమని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.
  • బీజేపీ తొమ్మిదేళ్ల పాలన దేశ రాజ్యాంగానికి వినాశకరంగా మారిపోయిందని సీపీఐ నేత డీ రాజా ఆరోపించారు.
  • విపక్షాల సమావేశం.. దేశాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పనిచేయాలన్న సందేశాన్ని ఇచ్చిందని సమాజ్​వాదీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.
  • బీజేపీ-ఆర్ఎస్ఎస్​కు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్​పై ఆప్ ధ్వజం
మరోవైపు, దిల్లీ పాలనా వ్యవహారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​ను అడ్డుకుంటామని కాంగ్రెస్ మినహా 11 పార్టీలు స్పష్టంగా చెప్పాయని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. విపక్ష నేతల సమావేశం తర్వాత ప్రకటన విడుదల చేసిన ఆప్.. రాజ్యసభలో ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా నిలబడతామని ఆ పార్టీలు హామీ ఇచ్చినట్లు తెలిపింది. జాతీయ పార్టీగా అన్ని విషయాలపై తన వైఖరిని ప్రకటించే కాంగ్రెస్ మాత్రం.. ఈ ఆర్డినెన్స్​పై నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఈ అంశంపై కాంగ్రెస్ మౌనం వహించడం చూస్తే.. ఆ పార్టీ ఉద్దేశాలపై అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించింది.

విపక్ష సమావేశంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కోవడం చేతకాక.. మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన నేతలే.. కాంగ్రెస్ పార్టీతో కలిసి భేటీకావడం విచిత్రంగా ఉందని విపక్ష పార్టీలకు చురకలు అంటించారు. ప్రస్తుతం అధికారం రాజభవనాల్లో లేదని, ప్రజలతోనే ఉందన్న ఇరానీ.. వంతెనలు కట్టడం చేతకాని వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీలను అనుసంధానిస్తున్నామని చెప్పడం విడ్డూరమని నీతీశ్ సర్కారుపై విమర్శలు చేశారు. ఇటీవల బిహార్​లో కూలిన వంతెన ఘటనను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jun 23, 2023, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.