ETV Bharat / business

నష్టాలకు బ్రేక్​ - సెన్సెక్స్​ 694 పాయింట్స్ అప్​ - రాణించిన ఆటో, మెటల్, బ్యాంకింగ్​ స్టాక్స్ - STOCK MARKET TODAY

ఒడుదొడుకులతో ప్రారంభమై చివరికి 24,000 ఎగువన ముగిసిన నిఫ్టీ

Bull Market
Stock Market (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 3:38 PM IST

Updated : Nov 5, 2024, 4:13 PM IST

Stock Market Close Today November 5, 2024 : మంగళవారం తీవ్ర ఒడుదొడులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, మెటల్​, బ్యాంకింగ్​​ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.

చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 694 పాయింట్లు లాభపడి 79,476 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 217 పాయింట్లు వృద్ధి చెంది 24,213 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు : జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎస్​బీఐ, బజాజ్ ఫైనాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, టాటా మోటార్స్​, మారుతి సుజుకి
  • నష్టపోయిన షేర్లు : అదానీ పోర్ట్స్​, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, టైటాన్​, హిందుస్థాన్ యూనిలివర్​, సన్​ఫార్మా, రిలయన్స్​

ఒడుదొడుకలకు కారణాలివే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం సహా, యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్ల ప్రకటించనున్న నేపథ్యంలో చాలా మంది మదుపరులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఇది కొంత వరకు స్టాక్ మార్కెట్​ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. అయితే మార్కెట్ క్రాష్ తరువాత స్టాక్స్​ను తగ్గిన ధరల వద్ద కొనేందుకు మదుపరులు మొగ్గు చూపడం వల్ల మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.4,329.79 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. వాస్తవానికి గత కొంతకాలంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారత్​ నుంచి ఉపసంహరించుకుంటున్నారు. ఇది కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్​పై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.​

గ్లోబల్ మార్కెట్స్​
ఏసియన్ మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్​ లాభాలతో ముగియగా, సియోల్​ నష్టాలపాలయ్యింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.60 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 75.53 డాలర్లుగా ఉంది.

Last Updated : Nov 5, 2024, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.